Allu Arjun : పుష్ప 2 ఓటిటి స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిందీ మూవీ. అలాగే అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా ఒక రాత్రంతా చంచల్ గూడ జైలులో కూడా ఉంచేలా చేసింది. అవన్నీ ఎలా ఉన్నా.. పుష్ప 2 సౌత్ లో యావరేజ్ అనిపించుకుంది. నార్త్ లో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ కు ఎప్పటికీ సాధ్యం కాని మైల్ స్టోన్స్ ను టార్గెట్ గా సెట్ చేసింది.
మామూలుగా ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. బట్ రీసెంట్ గా మరో 24 నిమిషాల ఫుటేజ్ ను కూడా యాడ్ చేశారు. ఆ ఫుటేజ్ చూడ్డానికి కూడా జనం థియేటర్స్ కు వెళ్లారు అంటే పుష్పరాజ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ఇక ఈ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
పుష్ప 2 ను ఈ నెల 30 నుంచి స్ట్రీమ్ చేయబోతున్నట్టు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ మేరకు రీసెంట్ గా యాడ్ చేసిన ఫుటేజ్ తో కలిపి ఏకంగా 3 గంటల 44 నిమిషాల సినిమాను ఓటిటిలో చూసేయొచ్చు అని కూడా చెప్పింది. సో.. ఇక పుష్పరాజ్ కు ఓటిటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com