Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్

Pawan Kalyan :  ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ నెల 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒక వారం ముందుగానే మార్చారు. 19నే విడుదల చేస్తాం అని చెప్పారు. మామూలుగా అదే డేట్ లో ధురంధర్ 2 విడుదలవుతుంది. ఆ టైమ్ లో భారీ అంచనాలున్న మూవీతో పోటీ అవసరమా అనుకున్నారు. అయినా పోటీలో ఉండాల్సిందే అని ఫిక్స్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్. ఆ కారణంగానే ఈ మూవీ 19నే విడుదల కాబోతోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. మామూలుగా ఇది తమిళ్ మూవీ తెరికి రీమేక్ అనుకున్నారు. బట్ అది రీమేక్ కాదు అని ఖచ్చితంగా చెప్పాడు హరీష్. ఆ కారణంగా అభిమానులు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు.

ఇక ఈ మూవీ నుంచి మరో పాట విడుదల చేయబోతోంది టీమ్. రిలీజ్ కు దగ్గరగా వస్తోంది కాబట్టి ప్రమోషన్స్ కూడా భారీగా ఉండాలని భావించింది టీమ్. ఆ మేరకు ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్ గా ఉండబోతున్నాయి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ నెల 15న అది జరగబోతోంది. ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ పై అందరి ఫోకస్ ఉండబోతోంది.

ఇప్పటికైతే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ తో పాటు యాటిట్యూడ్ వేరే రేంజ్ లో ఉండబోతోంది అనేలా ఉంది. అతని పాత్ర గబ్బర్ సింగ్ కు మించిన రేంజ్ లో ఉంటుందని టాక్. ఈ సారి కూడా అతను పోలీస్ గానే కనిపించబోతున్నారు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఆ ఇద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం భారీగా ఉండబోతోంది అనిపించేలా ఉంది.

Tags

Next Story