Bollywood: టీవీ స్టార్ కూతురితో సైఫ్ తనయుడు డేటింగ్... బహిరంగంగానే...

Bollywood: టీవీ స్టార్ కూతురితో సైఫ్ తనయుడు డేటింగ్... బహిరంగంగానే...
X
ఇబ్రహీం, పాలక్ డేటింగ్ లో ఉన్నారన్నది నిజమేనంటున్న నెటిజన్స్

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, అతని మాజీ భార్య అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, హీరోయిన్ పాలక్ తివారీతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాలక్ తివారీ ప్రముఖ టీవీ స్టార్ శ్వేతా తివారీ కుమార్తె. పాలక్ ఇటీవలే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే పాలక్ ఈ సినిమా చేయడానికి ముందు నుంచే ఇబ్రహీంతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.


వీరి డేటింగ్ పై వస్తోన్న వార్తలకు మరింత ఆజ్యం పోసేలా రీసెంట్ గా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. జూలై 22న రాత్రి ఇబ్రహీం, పాలక్ వేర్వేరుగా కనిపించారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతోన్న ఫొటోలను బట్టి చూస్తే వారు కలిసే సినిమాను వీక్షించినట్టు తెలుస్తోంది. ఈ జంట ముంబైలోని మల్టీప్లెక్స్‌లో 'గ్రెటా గెర్విగ్ 'బార్బీ'ని చూడటానికి థియేటర్‌కు వేర్వేరుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు థియేటర్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. ఈ సమయంలో పాలక్ బ్లాక్ క్రాప్ టాప్, జాకెట్ అండ్ బ్లాక్ ప్యాంట్ లో కనిపించగా.. ఇబ్రహీంతెల్లటి టీ-షర్ట్, నలుపు షర్టును ధరించి కనిపించారు. అయితే వీరిద్దరూ వేర్వేరుగా కనిపించినా.. ఓ చిన్న హింట్ తో దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇబ్రహీం బయటికి వస్తున్న సమయంలో తన చేతిలో పాలక్ జాకెట్ పట్టుకుని రావడం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే వీరు కలిసే సినిమాను చూసినట్టు తెలుస్తోంది.


ఇక వీరివురికి సంబంధించిన పలు ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇబ్రహీం అలీ ఖాన్య.. ఇటీవల విడుదలైన కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లు నటించారు. ఇదిలా ఉండగా పాలక్ చివరిసారిగా సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో కనిపించింది. ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023న థియేటర్‌లలో విడుదలైంది. అయితే, ఇది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ను సృష్టించడంలో మాత్రం విఫలమైంది.

ఇక హాలీవుడ్ ఫిల్మ్ 'బార్బీ' సినిమా ఇటీవలే విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ.. పాకిస్థాన్, ఇరాన్ లాంటి దేశాలు ఈ మూవీని తాత్కాలికంగా నిలిపివేశాయి. పంజాబ్ సెన్సార్ బోర్డు చేసిన ఆరోపణల నిమిత్తం ఈ నిషేధం ప్రకటించగా.. ఈ అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను మళ్లీ ప్రదర్శించనున్నారు.





Tags

Next Story