Leonardo Gigi Dating: చెట్టాపట్టాల్ వేస్తోన్న కొత్త జంట

Leonardo Gigi Dating: చెట్టాపట్టాల్ వేస్తోన్న కొత్త జంట
సెప్టెంబర్ 2022లో ఈ జంట మొదటి సారి డేటింగ్ పుకార్లను ఎదుర్కొంది

హాలీవుడ్ నటుడు, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, అమెరికన్ మోడల్ గిగీ హడిద్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వరుసగా రెండవరాత్రి హాంప్టన్స్ లోని రెండు వేరువేరు పార్టీలలో ఇద్దరు కలిసి కనిపించారు. డికాప్రియో 28ఏళ్ల మోడల్ తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగడంతో హాలీవుడ్ సర్కిళ్లలో చర్చమొదలైంది. వారు దినెడ్ రిచీ అవాకా వ్యవస్థాపకుడు బెర్ట్ హెడయా డానీ అబెక్కేసర్, హడిద్ బడ్డీ లియో తో కనిపించారు. ఆ తర్వాత అకివా, గ్యారీ కాన్ఫెర్ యొక్క బాటిల్ సర్వీస్ ఫ్యూయెల్ వాటర్ మిల్ వేడుకలో కూడా కనిపించారు. దీంతో వారు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిద్దరు స్నేహితులు మాత్రమేనని మరికొందరు అంటున్నారు.





న్యూయార్క్ నగరంలో ఫ్యాషన్ వీక్ సందర్భంగా సెప్టెంబర్ 2022లో ఈ జంట మొదటి సారి డేటింగ్ పుకార్లను ఎదుర్కొంది. ఇప్పటికీ డేటింగ్ పుకార్లు అలాగే షికార్లు చేస్తున్నాయి.అయితే... వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గిగీకి 25ఏళ్లు నిండిన తర్వాత లియోనార్డో తన స్నేహితురాలు కామిలా మోరోన్ తో తన నాలుగు సంవత్సరాల రిలేషన్ ను ముగించినట్లు తెలిసింది. ఆతర్వాత గిగీతో జతకట్టినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. గిగీకి ఇప్పటికే రెండేళ్ల కూతురు ఉంది. లియోనార్డో గతంలో సూపర్ మోడల్ గిసెల్ బుండ్చెన్, బార్ రెఫెలీ, బ్లేక్ లైవ్లీతో సహా మరికొంతమందితో డేటింగ్ చేశాడు. లియోనార్డో డేటింగ్ చేస్తున్నప్పుడు వారెవరూ 25 ఏళ్లు పైబడినవారు కాదు.






లియోనార్డో తన తదుపరి చిత్రం మార్టిన్ న్కోర్సెస్ యొక్క కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ లో కనిపించనున్నాడు. ఇది అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రాబర్ట్ డి నీరో, లిల్లీ గ్లాడ్ స్టోన్, జెస్సీ ప్లెమోన్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story