David Warner : వార్నర్ తో వర్కవుట్ అవుతుందా..

David Warner :  వార్నర్ తో వర్కవుట్ అవుతుందా..
X

నితిన్, శ్రీ లీల జంటగా రూపొందిన సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో తమ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పనిలో ఉంది టీమ్. నితిన్ ఈ మూవీపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నాడు. బట్ రాబిన్ హుడ్ తన కెరీర్ లో బెస్ట్ అవుతుందని కాన్పిడెంట్ గా చెప్పుకుంటున్నాడు. టీజర్ ఓ మేరకు బానే ఉంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన అదీ ద మ్యాజిక్ పాట యూత్ కు, మాస్ కు బాగా కనెక్ట్ అయిపోయిందనే చెప్పాలి.

ఇక ఈ మూవీకి సంబంధించి టీమ్ ఎగ్జైటింగ్ గా చెబుతున్న విషయం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర గురించి అతను ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ప్లే చేశాడు. అంతకు ముందు ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా తెలుగు వాళ్లందరికీ బాగా తెలిసిపోయాడు వార్నర్. పైగా తెలుగు సినిమాల పాటలు, డైలాగ్స్ తో రీల్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటాడు. అందుకే అతను ఈ మూవీలో నటిస్తున్నాడు అనే విషయం చాలామందిలో ఆసక్తి కలిగించింది. అయితే అతని పాత్రేంటీ.. ఆ పాత్రకు సినిమాలో ఉండే ఇంపార్టెన్స్ ఏంటీ.. ఆ పాత్ర వేసే ఇంపాక్ట్ ఏంటీ అనేది సినిమా వస్తే తెలుస్తుంది. కానీ ఏ ఇంపాక్ట్ లేకుండా కేవలం హైప్ కోసమే డేవిడ్ ను యూజ్ చేసుకుంటే మాత్రం అసలుకే ప్రాబ్లమ్ అవుతుంది. వార్నర్ ఉన్నాడని వెళ్లే ఫ్యాన్స్ కు అతని పాత్ర నచ్చకపోతే అది సినిమాపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

కానీ తాజాగా విడుదల చేసిన వార్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కూల్ లుక్ తో కనిపిస్తున్నాడు. మరి రాబిన్ హుడ్ కు డేవిడ్ వార్నర్ ఏమేరకు హెల్ప్ అవుతాడో చూడాలి.

Tags

Next Story