WARNER: హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ‘రాబిన్‌హుడ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయనకు డైరెక్టర్ వెంకీ కుడుముల స్వాగతం పలికారు. సాయంత్రం జరగనున్న ‘రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్ పాల్గొననున్నారు. నితిన్-శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 28న రాబిన్‌హుడ్ విడుదల కానుంది.
సునీల్ నరైన్ అరుదైన ఫీట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ప్లేయర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. IPLలో 100 సిక్స్‌లు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. నరైన్ కంటే ముందు ఆండ్రూల్ రస్సెల్ (209 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (107 సిక్స్‌లు) ఉన్నారు. అలాగే, సునిల్ నరైన్ తన ఐపీఎల్ కెరీర్లో 180 వికెట్లు తీశాడు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో RCB విజయం సాధించింది.
అభిమాని చేసిన పనికి షాకైన కోహ్లీ!
కోల్‌కతాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అర్ధ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఓ అభిమాని చేసిన పనికి కోహ్లీ షాకయ్యారు. అభిమాని పిచ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ కాళ్లను మొక్కాడు. సెక్యూరిటీ గార్డులు వెంటనే స్పందించి అతడిని అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com