Vijay Devarakonda : డియర్ రౌడీ ఫ్యాన్స్.. అవేం నమ్మొద్దు

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకు సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధింది ఫస్ట్ లుక్ పోస్టర్ లీక్ అయిందంటూ ఒక రూమర్ వినిపిస్తోంది. ఆ పోస్టర్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతోంది కూడా. కానీ అది నిజం కాదని.. మీకోసం అద్భుతమైన రెడ్ హాట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ అవుతోంది. ఒరిజినల్ నే చూసి ఆనందించాలని కోరుతూ ఓ లేఖ విడుదల చేసింది టీమ్.
ఇప్పటి వరకూ ఈ మూవీ 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని కూడా చెప్పారు. అంటే రీసెంట్ గా 90శాతం చిత్రీకరణ పూర్తయిందనే రూమర్స్ వచ్చాయి. వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ మాటతో. ఈ ప్రాజెక్ట్ లోకి లేటెస్ట్ గా సత్యదేవ్ ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తోనే సత్యదేవ్ జాయిన్ అయ్యాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
సో.. మొత్తంగా షూటింగ్ అప్డేట్స్ తో పాటు త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా వస్తుందన్న మేటర్ చెప్పారు. ఇదంతా చూస్తుంటే ముందు నుంచీ చాలామంది చెప్పుకున్నట్టు ఈ మూవీ ఈ యేడాది విడుదల కాకపోవచ్చేమో అని కూడా అనిపిస్తోంది కదా. ఏదేమైనా సో.. డియర్ రౌడీ ఫ్యాన్స్.. మీ రౌడీ హీరో టీమ్ నుంచి ఒరిజినల్ లుక్ వచ్చే వరకూ లీక్స్ ను షేర్ చేయొద్దు అన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com