Deepika Padukone: ఆ టాలీవుడ్ స్టార్‌‌తో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ భామలు..

Deepika Padukone: ఆ టాలీవుడ్ స్టార్‌‌తో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ భామలు..
Deepika Padukone: దీపికా పదుకొనె తాను ఏ టాలీవుడ్ హీరోతో నటించాలనుకుంటుందో బయటపెట్టింది.

Deepika Padukone: ఒకప్పుడు టాలీవుడ్ అంటే మిగతా ఇండస్ట్రీలులాగానే అనుకునేవారు సెలబ్రిటీలు. కానీ 'బాహుబలి'తో ఒక్కసారిగా టాలీవుడ్ రేంజ్ ఆకాశానికి వెళ్లిపోయింది. తాజాగా వచ్చిన పుష్ప క్రేజ్ చూసిన తర్వాత ఇక టాలీవుడ్‌ను ఇంకే ఇండస్ట్రీ అందుకోలేదు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం టాలీవుడ్ హీరోలతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దీపికా పదుకొనె కూడా తాను ఏ టాలీవుడ్ హీరోతో నటించాలనుకుంటుందో బయటపెట్టింది.

'పుష్ప' సినిమా విడుదలయినప్పుడు ముందుగా దానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొందరు సినిమా బాగుందన్నారు.. కొందరు బాలేదన్నారు కానీ అనూహ్యంగా పుష్ప కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులనే సృష్టించింది. క్రికెట్‌ గ్రౌండ్‌లో, పెళ్లిల్లలో, సంగీత్‌లలో ఎక్కడ చూసినా పుష్ప పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా పుష్ప శ్రీవల్లి స్టెప్ కూడా చాలా వైరల్ అయ్యింది.

పుష్ప హిట్ ఒక రేంజ్‌లో ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు బన్నీపై పడింది. అల్లు అర్జున్‌ను ఎలాగైనా బాలీవుడ్‌కు తీసుకెళ్లాలని అక్కడి వారంతా ఎదురుచూస్తున్నారు. పైగా అక్కడి హీరోయిన్లు కూడా అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయాలన్న కోరికను బయటపెడుతున్నారు. తాజాగా ఆలియా భట్.. బన్నీతో యాక్ట్ చేయాలని ఉందని చెప్పగా.. ఇటీవల మరో హీరోయిన్ కూడా అల్లు అర్జునే కో స్టార్‌గా కావాలంటోంది.

త్వరలో విడుదల కానున్న 'గెహ్రియాన్' మూవీ చుట్టూ అలుకున్న కాంట్రవర్సీలో నిండిపోయింది దీపికా పదుకొనె. అయితే తాజాగా టాలీవుడ్ హీరోల గురించి ఈ భామ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు టాలీవుడ్ హీరోల్లో బాగా నచ్చిన హీరో ఎన్‌టీఆర్ అని తెలిపింది. అంతే కాకుండా తనకు అల్లు అర్జున్‌తో యాక్ట్ చేయాలని ఉందని కూడా చెప్పింది. మరి ప్రస్తుతం ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ కే'లో నటిస్తున్న దీపికా.. అవకాశం వస్తే ఈ ఇద్దరు స్టార్లతో కూడా యాక్ట్ చేస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story