Ranbir Alia: రణభీర్, ఆలియా పెళ్లి.. హాజరుకానున్న హీరో ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్..

Ranbir Alia: బాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లికి సిద్ధమయ్యింది. వారే రణభీర్ కపూర్, ఆలియా భట్. వీరిద్దరి లవ్ స్టోరీ ఇంకా ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు ఇటీవల వీరి ప్రేమ విషయం బయటపెట్టారు. అప్పటినుండి వీరి పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లి అప్డేట్ ఒకటి బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఆలియా కంటే చాలాముందు రణభీర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆలియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే సమయానికి రణభీర్ స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే అప్పటికే కొందరు బాలీవుడ్ బ్యూటీలతో ప్రేమాయణాన్ని కూడా నడిపాడు రణభీర్. ముందుగా తన మొదటి చిత్రం 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ'లో తనతో పాటు నటించిన కత్రినా కైఫ్‌ను ప్రేమించిన రణభీర్.. ఆ తర్వాత కొన్నాళ్లు దీపికా పదుకొనెతో రిలేషన్‌లో ఉన్నాడు.
ప్రస్తుతం రణభీర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దీపికా, కత్రినా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. కత్రినా కాకపోయినా దీపికా పదుకొనె మాత్రం ఆలియాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. రణభీర్‌తో మాట్లాడకపోయినా.. ఆలియాను మాత్రం తన ఫ్రెండ్‌గా భావిస్తుంది దీపికా. అందుకే తనకోసం వారి పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకుందట దీపికా. తను మాత్రమే కాదు.. కత్రినా కైఫ్ కూడా పెళ్లికి రానుందని టాక్ నడుస్తోంది. ఇక రణభీర్ కపూర్, ఆలియా భట్.. కపూర్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన ఆర్కే హౌస్‌లో ఏప్రిల్ 17న వివాహం చేసుకోనున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com