Deepika Padukone: 'హీరోను ముద్దు పెట్టుకోవడానికి భర్త పర్మిషన్ తీసుకున్నావా.?'.. దీపికా రియాక్షన్..

Deepika Padukone: హీరోను ముద్దు పెట్టుకోవడానికి భర్త పర్మిషన్ తీసుకున్నావా.?.. దీపికా రియాక్షన్..
Deepika Padukone: అందుకే ఒక ప్రేమకథలో ఉండే రొమాన్స్ అంతా గెహ్రియాన్ ట్రైలర్‌లోని కనిపిస్తుంది.

Deepika Padukone: దీపికా పదుకొనె వెండితెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. దీపికా మాత్రమే కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లంతా ఈమధ్య స్లోగానే సినిమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. చాలాకాలం తర్వాత దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమే 'గెహ్రియాన్'. ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతుండగా ఇప్పటికే దీని చుట్టూ చాలా కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి.

సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, దీపికా పదుకొనె, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమే 'గెహ్రియాన్'. పెళ్లయిన తర్వత దీపికా కేవలం తన భర్త రణవీర్ సింగ్‌తోనే ఎక్కువ సినిమాలు చేసింది. అవి కూడా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలే. కానీ గెహ్రియాన్ మాత్రం అలా కాదు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఇది ఒక ప్రేమకథ అని.

అందుకే ఒక ప్రేమకథలో ఉండే రొమాన్స్ అంతా గెహ్రియాన్ ట్రైలర్‌లోని కనిపిస్తుంది. దీపికా ఇందులో కొన్ని లిప్ కిస్ సీన్స్‌లో కూడా పాల్గొంది. దీని గురించి రణవీర్ సింగ్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే గెహ్రియాన్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు మాత్రం రణవీర్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే ట్రోల్స్‌పై దీపికా ఎట్టకేలకు రియాక్ట్ అయ్యింది.

అసలు ఇలాంటి ట్రోల్స్‌పై రియాక్ట్ అవ్వడం కూడా వేస్ట్ అంటోంది దీపికా. తాను ఇలాంటి సినిమా చేయడానికి రణవీర్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకుందా అని నెటిజన్లు అడిగిన ప్రశ్నపై దీపికా రియాక్ట్ అయ్యింది. మేము అస్సలు కామెంట్స్ చూడము. పట్టించుకోము. అలా చేయడం మాకు చాలా స్టుపిడ్ అనిపిస్తుంది అని తెలిపింది. గెహ్రియాన్ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story