Deepika Padukone: దీపికా పదుకొనే.. జుట్టుని ఎలా సంరక్షించుకుంటుందో తెలుసా..

Deepika Padukone: అద్భుతమైన అందంతో అలరించే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన జుట్టు సంరక్షణ రహస్యాలను పంచుకుంది.ఆమె తన మనోహరమైన జుట్టు కోసం ప్రతిరోజు రాత్రి పూట తలకు కొబ్బరి నూనెను మసాజ్ చేస్తుందట. ఇది జుట్టు కుదుళ్లను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. దాంతో జుట్టు చిట్లడం, రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఉండవని చెబుతోంది.
చిత్ర పరిశ్రమలో ఉన్నందున నిరంతరం తన రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో జుట్టుకు సరైన పోషణ అవసరం అవుతుంది. కొబ్బరి నూనె అలా చేయడంలో సహాయపడుతుంది. నటి తనకు ఇష్టమైన జుట్టుని జాగ్రత్తగా చూసుకుంటానని పేర్కొంది. కొబ్బరి నూనెతో మసాజ్ తో పాటు సమయానికి తగినంత నిద్ర, వ్యాయామం ఆరోగ్యానికి అవసరం అని తెలిపింది.
దీపిక జుట్టు సంరక్షణ చిట్కాలు
ఆరోగ్యకరమైన జీవనశైలి
తగినంత నీరు
తగినంత నిద్ర
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం
వ్యాయామం
ప్రజలకు ఈ విషయాలు తెలిసినప్పటికీ, వారు వాటిని నిజ జీవితంలో పాటించరు. కానీ వీటిని అనుసరించడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com