Deepika Padukone: రైటర్‌గా దీపికా పదుకొనె.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షేర్..

Deepika Padukone (tv5news.in)
Deepika Padukone: బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న సీనియర్ హీరోయిన్లలో దీపికా పదుకొనె కూడా ఒకరు. దీపికా గతకొంతకాలంగా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయినా కూడా తనకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది.
దీపికా పదుకొనె అంటే బాలీవుడ్‌లో ఓ స్పెషల్ స్థానం ఉంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ వల్ల కూడా దీపికా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తన సహ నటుడు రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్‌గా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం దీపికా చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. ప్రభాస్‌తో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె'తో తెలుగులో డెబ్యూ ఇవ్వనుంది ఈ భామ.
దీపికా పదుకొనె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎప్పటికప్పుడు తన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తాను ఒకప్పుడు రాసిన ఓ కవితను షేర్ చేసింది దీపికా. ఇది చదివిన నెటిజన్లు దీపికాలో ఒక రైటర్ కూడా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. 'ఇదే కవిత రాయడంలో నా మొదటి, చివరి ప్రయత్నం. ఇది నేను 12 ఏళ్లు ఉన్నప్పుడు 7వ క్లాస్ చదువుతున్నప్పుడు.' అంటూ తన కవితను షేర్ చేసింది దీపికా పదుకొనె.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com