Deepika Padukone: నిర్మాతగా మారతానంటోన్న దీపికా.. ఓ స్పెషల్ బయోపిక్‌తో..

Deepika Padukone (tv5news.in)
Deepika Padukone: బాలీవుడ్‌లో ఎంతమంది యంగ్ హీరోయిన్లు వచ్చినా.. సీనియర్ హీరోయిన్ల ప్లేస్‌ను మాత్రం ఎవ్వరూ ఆక్రమించలేదు. బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఏ సీనియర్ సినిమా వస్తుందా అని ఇప్పటికీ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న దీపికా.. 'గెహ్రియాన్' చిత్రంతో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ త్వరలోనే ప్రొడ్యూసర్ అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఓం శాంతి ఓం' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనె.. మొదటినుండి స్టార్ హీరోల సరసన నటించి తాను కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సాధించుకుంది. ఇక సంజయ్ లీలా భన్సాలీలాంటి డైరెక్టర్‌తో చేతులు కలిపిన తర్వాత దీపికాలోని నటిని మరో కోణంలో చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక హీరోయిన్‌గానే బిజీ అయిపోయిన దీపికా.. నిర్మాతగా మారతానంటోంది. అది కూడా తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి బయోపిక్‌ను తెరకెక్కిస్తానంటోంది.
ఒకప్పటి స్పోర్ట్స్ లవర్స్‌కు ప్రకాశ్ పదుకొనె పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాడ్మింటన్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అతికొద్దిమంది ఇండియన్స్‌లో ప్రకాశ్ ఒకరు. 1980లో వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలవడంతో పాటు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను గెలిచారు ప్రకాశ్ పదుకొనె.
ఇప్పటికే దీపికా నిర్మించే తన తండ్రి బయోపిక్‌కు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయిపోయాయట. ఇండియా వరల్డ్ కప్ గెలవకముందే తన తండ్రి బ్యాడ్మింటన్‌తో ఇండియాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని దీపికా గుర్తుచేసుకుంది. ఆయన ప్రాక్టీస్ చేయడానికి సరైన బ్యాడ్మింటన్ కోర్టులు కూడా ఉండేవి కాదని, పెళ్లి మండపాల్లో ప్రాక్టీస్ చేసేవారని.. అందుకే ఆయనే తన స్ఫూర్తి అని చెప్పింది దీపికా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com