Deepti Bhatnagar : 54 ఏళ్ల వయసులోనూ గ్లామర్ షో.. తగ్గేదేలే..!

తెలుగు ప్రేక్షకులకు డ్రీమ్ బ్యూటీ అంటే సీనియర్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ అనే చెప్పాలి. టాలీవుడ్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్ళిసందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో సౌందర్య లహరి పాటలో ఆమె గ్లామర్‌ని చూసి అలనాటి హీరోయిన్లు చాలా మంది ఈర్ష్య పడ్డారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె అందం ఏంటో.

ఆ తర్వాత నాగార్జునతో 'ఆటో డ్రైవర్', బాలకృష్ణతో 'సుల్తాన్', మోహన్ బాబుతో 'కొండవీటి సింహాసనం', రాజశేఖర్‌తో 'మా అన్నయ్య' వంటి చిత్రాల్లో నటించింది.. అయితే ఈ సినిమాలు ఆమెకి అంతగా సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి.. దాంతో మళ్లీ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడో రెండు మూడు సినిమాలు చేసి ఆ తర్వాత రణదీప్ ఆర్యను అనే డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుంది.

ఇప్పుడు ఈమెకి ఇద్దరు కొడుకులున్నారు.. ఇక సోషల్ మీడియాలో దీప్తి భట్నాగర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవలి కాలంలో ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటో షూట్ లతో దర్శనమిస్తోంది. 50 ఏళ్ల వయసులో ఆమె చాలా హాట్‌గా కనిపిస్తోంది.. తాజాగా దీప్తి షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com