50 ల్లోనూ ఎంత అందంగా..

53 ఏళ్ల దీప్తి భట్నాగర్ తెలుగు ప్రేక్షకుల కలల రాకుమారి. సినిమాలకు దూరంగా ఉన్నా ట్రావెలాగ్ షో చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంది. తాజాగా దీప్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఔరా.. ఏమా అందం.. పగడపు దీవుల్లో పాలరాతి బొమ్మలా.. అలల కెరటాల మధ్య నులి వెచ్చని సూర్యకిరణాలు మేను మీద పడుతుంటే ఆమె అందం ఆర్ణవమైంది.
వయసు మనిషికే కాని మనసుకి కాదంటూ ఫోటోకి ఫోజులిస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు వారిని పలకరించడంతో పాటు పదికాలాలు గుర్తుండి పోయే పాత్రలో నటించింది. ఆ చిత్రం వచ్చి రెండు దశాబ్ధాలు దాటి పోయినా ఇప్పటికీ అందులోని పాటలు సంగీత ప్రియులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. హిందీలో ఈ చిత్రాన్ని మేరే సప్నోకి రాణిగా పునర్నిర్మించారు. సెప్టెంబర్ 30న తన 53వ పుట్టిన రోజును జరుపుకున్న దీప్తి కేవలం 25 సినిమాల్లో మాత్రమే నటించింది.
ఆమె చివరిసారిగా ప్రియదర్శన్ దర్శకత్వంలో 2007 లో వచ్చిన మలయాళ చిత్రం రాకిలిపట్టులో కనిపించింది. దర్శకుడు రణదీప్ ఆర్యను వివాహం చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంది. దీప్తి ఉత్తరాఖండ్‌లో భర్త తన ఇద్దరు పిల్లలతో నివసిస్తోంది. ఇద్దరు బిడ్డలకు తల్లైనా తరగని అందంతో నేటి యువ నటీమణులతో పోటీ పడుతోంది దీప్తి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com