డీమాంటీ కాలనీ.. ట్రైలర్ తోనే ఉ.. పోయించారుగా

కొన్నాళ్ల క్రితం వచ్చిన డీమాంటీ కాలనీ అనే తమిళ్ సినిమా తెలుగులోనూ ఆకట్టుకుంది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ మూవీగా అదరగొట్టింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాల సినిమా ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఈచిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు డీమాంటి కాలనీ 2 వస్తోంది. ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేశాడు. ఆల్రెడీ గతంలోనే విడుదల చేసిన ట్రైలర్ హారర్ ఓ రేంజ్ లో ఉండబోతోందనే హింట్ ఇచ్చింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా రెండో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ దాన్ని డబుల్ చేసేలా కనిపిస్తోంది. ట్రైలర్స్ లోనే వణికించే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్ ఆరంభంలోనే హీరో అరుళ్ నిధి తలకిందులుగా వేళ్లాడుతూ.. తనను తాను నరుక్కునే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇక ఒక బౌద్ద భిక్షువు( మాంక్ ) వారిస్తున్నా వినకుండా అతను ఓ ఇంట్లోకి వెళతాడు. అతన్ని కాపాడే క్రమంలో వెళ్లిన మాంక్ తో పాటు అతని టీమ్ ఆ ఇంట్లో ప్రత్యక్ష నరకం చూస్తారు. ప్రతిక్షణం భయపడతారు అనేలా ఉందీ ట్రైలర్. రెగ్యులర్ హారర్ మూవీ లవర్స్ కూడా వణికిపోయే కంటెంట్ తో వస్తున్నట్టు ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఓ రకంగా థియేటర్స్ లో భయంతో ఉ... పోసుకోవడం ఖాయం అనేలా ఉంది.
అజయ్ మరోసారి ఆడియన్స్ న నెక్ట్స్ లెవల్ లో భయపెట్టడమే టార్గెట్ గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో సగం మొహం హెయిర్ తో కవర్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించిన అరుళ్ నిధి ఈ సారి క్రాఫ్ చేయించుకున్నాడు. అతని లక్ బావుంది. అరుళ్ నిధితో పాటు ప్రియాభవానీ శంకర్ మనకు తెలిసిన ఫేస్. మిగతా అంతా తమిళ్ వారికి తెలిసినవారిలా ఉన్నారు. అయినా ఇలాంటి సినిమాలకు స్టార్ కాస్ట్ తో పని ఉండదు. బలమైన కంటెంట్ ఉంటే చాలు.. భయపెట్టేయొచ్చు. భయపెడితే కమర్షియల్ హిట్ గ్యారెంటీ కదా..
ఈ ట్రైలర్ కు మా రేటింగ్ : 3 / 5
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com