Jr NTR : కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్

Jr NTR :  కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ కాంతార చాప్టర్ 1 కోసం వస్తున్నాడు. ఈ నెల 28న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగబోతోన్న కాంతార చాప్టర్ 1 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ అటెండ్ కాబోతున్నాడు. ఈ మేరకు మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ అంటే రిషబ్ శెట్టికి విపరీతమైన అభిమానం. పైగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా ఉంటాడు అనే రూమర్స్ కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీఆర్ ఈ మూవీ కోసం అటెండ్ కావడం అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అయితే రీసెంట్ గానే ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో గాయపడ్డాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి మూడు నాలుగు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని అతని పీఆర్ టీమ్ ప్రకటించింది. అయితే ఎన్టీఆర్.. ఆ యాడ్ షూటింగ్ కోసం వేసిన సెట్ పాడవుతుందని.. తన కారణంగా ఎక్కువ రోజులు రెంట్ కట్టాల్సి వస్తుందని ఆ గాయంతోనే యాడ్ పూర్తి చేశాడు. సో.. ఇది మరీ ఇబ్బంది పెట్టేంత పెద్ద గాయం కాదు అని అర్థం చేసుకోవచ్చు. అదే టైమ్ లో ఇలాంటి గాయాలతో పబ్లిక్ ఫంక్షన్స్ కు అటెండ్ కావడం కూడా కరెక్ట్ కాదేమో అనుకోవచ్చు.

ఇక కాంతార ఏ లెజెండ్ చాప్టర్1 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు ప్రతి భాషలోనూ ఇలాంటి స్టార్స్ ను చీఫ్ గెస్ట్స్ గా పిలుస్తూ అంచనాలు పెంచుతున్నాడు రిషబ్. మరి ఎన్టీఆర్ కాంతార కోసం ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.

Tags

Next Story