RRR : RRRలో మల్లి తల్లి.. బయట ఇలా యమ స్టైలిష్ గా..!

RRR : టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన RRR రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. గత నెల మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించి మెప్పించారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ల నటనకి మాత్రమే కాకుండా చాలా మంది నటులకి చాలా మంచి పేరు వచ్చింది. అందులో ఒకరు మల్లికి తల్లిగా లోకి పాత్రలో నటించిన అహ్మరీన్ అంజుమ్. సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ తనదైన నటనతో ఆమె ఆకట్టుకుంది. అహ్మరీన్ అంజుమ్‌కి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
RRR కంటే ముందు ఆమె 'క్లాస్ 83', 'దేవి ఔర్ హీరో', 'తొట్ట పటాకా ఐటం మాల్', 'సర్', 'హెర్ రెస్ట్‌లెస్ సౌల్', 'డోన్ట్ ఫర్‌గెట్ మామ్స్', 'జల్ దానవ్' సినిమాలలో నటించింది. కోల్‌కత్తాకి చెందిన ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. డైరెక్షన్, ఎడిటింగ్ విభాగాలలో కూడా మంచి పట్టుంది.
సర్' మూవీలో ఆమె పోషించిన దేవిక పాత్రని చూసిన రాజమౌళి ఆమెకి RRR లో మల్లికి తల్లి పాత్రను ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా అహ్మరీన్ అంజుమ్.. ఆమె స్టైలిష్ ఫొటోలకి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com