Samyuktha Menon: 'భీమ్లా నాయక్'లో రానా భార్యగా నటించింది ఎవరో తెలుసా..?

Samyuktha Menon (tv5news.in)
Samyuktha Menon: సంక్రాంతికి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం భీమ్లా నాయక్ గురించే ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరోను రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ 'భీమ్లా నాయక్'గా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. వపన్‌తో పాటు రానా ఫ్యాన్స్ కూడా భీమ్లా నాయక్‌పై అంచనాలు పెంచేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుండి అడవి తల్లి మాట అనే పాట విడులదయ్యింది. ఈ పాటలో తళుక్కున మెరిసిన మలయాళ కుట్టి సంయుక్త మీనన్ ఎవరా అంటూ ప్రేక్షకులు సెర్చింగ్ మొదలుపెట్టారు.
భీమ్లా నాయక్ మలయాళ వర్షన్ 'అయ్యపనుమ్ కోషియుమ్'లో హీరోల భార్యలకు అంతగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలుగు వర్షన్‌లో మాత్రం వారికి ప్రాధాన్యత ఉండేలా కథలో మార్పులు చేశారు రైటర్ త్రివిక్రమ్. అందుకే పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యామీనన్‌ను ఎంచుకున్నారు. రానా భార్యగా ఎవరు నటిస్తారు అన్నదానిపై చాలా రోజులే చర్చ సాగింది. ఫైనల్‌గా ఈ పాత్ర కోసం నిత్యా మీనన్‌లాగానే మరో మలయాళ భామ సంయుక్త మీనన్‌ను ఎంచుకున్నారు.
సంయుక్త మీనన్ ఇప్పుడిప్పుడే తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సంయుక్త. అలా బ్యాక్ టు బ్యాక్ మలయాళ సినిమాల్లోనే బిజీగా ఉన్న సమయంలో సంయుక్తకు కోలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. తమిళంలో ఒకట్రెండు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో నటించినా అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ మాలీవుడ్ బాట పట్టింది ఈ భామ.
మాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్‌కు పోటీగా సంయుక్త గుర్తింపును సంపాదించుకుంది. టోవినో థామస్‌తో అత్యధిక సినిమాల్లో నటించి మెప్పించింది. ఫైనల్‌గా ఇప్పుడు భీమ్లా నాయక్‌తో తెలుగులో అడుగుపెట్టనుంది. అడవి తల్లి మాట పాటలో సంయుక్త కనిపించింది కాసేపే అయినా ఎవరా ఈ అమ్మాయి అని అందరి చూపు తన వైపు తిప్పుకునేలా అనిపించింది సంయుక్త స్క్రీన్ ప్రెసెన్స్. తెలుగులో మొదటి సినిమానే ఇంత హైప్‌తో విడుదల అవుతుండడంతో సంయుక్తకు తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com