Adi Pinisetty : దేవా కట్ట మయసభలో ఆది

Adi Pinisetty :  దేవా కట్ట మయసభలో ఆది
X

టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి అన్నట్టుగానే దూకుడు పెంచుతున్నాడు. వెన్నెల మూవీతో తెలుగులో తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ ప్రారంభించిన దర్శకుడు దేవా కట్టా. ఆ తర్వాత కాస్త గ్యాప్ తో అతను రూపొందించిన ప్రస్థానం విమర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాతోనే సందీప్ కిషన్ నటుడుగా పరిచయం అయ్యాడు. ఆపై నాగ చైతన్య, సమంత జంటగా ఆటో నగర్ సూర్య రూపొందించాడు. బెజవాడ మార్కెట్ యార్డ్స్ లో ఉండే రాజకీయాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకీ ప్రశంసలు వచ్చాయి. కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీనికి తోడు చాలా ఆలస్యంగా విడుదలైంది. 2019లో ప్రస్థానం చిత్రాన్ని హిందీలో చేశాడు. అది పోయింది. చివరగా సాయిదుర్గా తేజ్ తో రిపబ్లిక్ మూవీ రూపొందించాడు. ఈ మూవీకీ అంతే.. ఓన్లీ అప్రిసియేషన్స్ మాత్రమే వచ్చాయి. దేవా కట్టా స్టోరీ టెల్లింగ్ హానెస్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ కంటెంట్ తో వస్తాడు. కానీ కమర్షియల్ సక్సెస్ లు రావడం లేదు అతనికి. ఈ కారణంగానే ఎప్పుడో స్టార్డమ్ రావాల్సి ఉన్నా.. ఇప్పటికీ రాలేదు.

ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఆది పినిశెట్టి హీరో. ఈ చిత్రానికి మయసభ అనే ఓ మంచి టైటిల్ పెట్టారు. మయసభ కూడా రాజకీయంగానే కనిపిస్తుంది. మయసభ పరాభవం తర్వాతే పాండవులు అడవులకు వెళతారు కదా.. అలా భారతాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా ఓ మంచి కథను సోషలైజ్ గా అల్లుకోవచ్చు. మరి అలాగే చేశాడా లేక ఈ టైటిల్ తో మరో తరహా కంటెంట్ తో వస్తున్నాడా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందట. దేవా కట్టాకు మార్కెట్ లేదు. అలాగే ఆదికి కూడా. ఒకవేళ ఆది పినిశెట్టి శబ్ధం మూవీ సూపర్ హిట్ అయితే ఈ మయసభకు క్రేజ్ వస్తుంది. మొత్తంగా ఆది శబ్ధం పై మయసభ బిజినెస్ ఆధారపడి ఉందనే చెప్పాలి.


Tags

Next Story