Aayudha Pooja Song : ఆయుధపూజకు సలామ్ కొట్టిన గద్దర్ అవార్డ్

Aayudha Pooja Song :  ఆయుధపూజకు సలామ్ కొట్టిన గద్దర్ అవార్డ్
X

తెలంగాణ ప్రభుత్వ అవార్డ్స్ లో భాగంగా ప్రకటించిన పురస్కారాలు కొన్ని వర్గాలకు నిరాశ కలిగించినా.. అవార్డ్స్ అందుకున్న సినిమాలు, వ్యక్తులు మాత్రం పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ పురస్కారం వస్తుందని భావించిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఆ అవార్డ్ అల్లు అర్జున్ కు వెళ్లిపోయింది. అయితే ఈ చిత్రంలోని ఆయుధ పూజ సాంగ్ కు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డ్ వచ్చింది. ఈ పాటకు కొరియోగ్రఫీ అందించింది గణేష్ ఆచార్య. ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో దర్శకుడు కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఆయుధ పూజ సాంగ్ గురించి ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. కానీ జనం అప్పుడు మరీ సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పుడైతే సినిమాలో ఆ పాటలోని స్టెప్పులు, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూశారో.. అంతే ఫిదా అయిపోయారు. ఈ పాట సీన్ కు, థీమ్ కు తగ్గట్టుగా గణేష్ సమకూర్చి నృత్య రీతులు ఆ తర్వాత కొన్ని లక్షల రీల్స్ గా మారాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మూమెంట్స్ కు జనం జేజేలు పలికేశారు. అతని ఎక్స్ ప్రెషన్స్ డ్యాన్స్ కే హైలెట్ అయిపోయాయి. దాన్ని రీ క్రియేట్ చేస్తూ కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. మొత్తంగా గణేష్ ఆచార్య ఇలాంటి హుక్ స్టెప్స్ కు, థీమ్ సాంగ్స్ కు బెస్ట్ అని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సారి అవార్డ్ తో కూడిన ప్రశంసలు వస్తున్నాయి. సో.. ఈ పాట ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను ఊపేస్తుందేమో.

Tags

Next Story