NTR : అదరగొట్టిన దేవర.. ఏకంగా 52 కేంద్రాల్లో

NTR :  అదరగొట్టిన దేవర.. ఏకంగా 52 కేంద్రాల్లో
X

ఒకప్పుడు ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అనాలంటే ఆ సినిమా ఎన్ని థియేటర్స్ లో ఎన్ని ఎక్కువ రోజులు ఆడింది అనేదే ప్రామాణికం. బట్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేదే చూస్తున్నారు. ఇంకా చెబితే మొదటి మూడు రోజుల్లోనే రికవర్ అవ్వాలి అన్నంతగా మారిపోయింది ట్రెండ్. ఈ కారణంగా 50 రోజులు, 100 రోజుల పోస్టర్స్ ఎప్పుడో కానీ కనిపించడం లేదు. కనిపించినా సెంటర్స్ పరంగా ఎక్కువ నంబర్స్ కనిపించడం లేదు. ఈ టైమ్ లో దేవర అదరగొట్టింది. ఏకంగా 52 కేంద్రాల్లో 50 రోజుల పోస్టర్ పడిందీ సినిమాకు.

ఆల్రెడీ ఓటిటిలో విడుదలై అక్కడా ఆకట్టుకుంటోంది. అయినా 50 రోజుల పోస్టర్ వరకూ ఆగిందంటే కారణం ఖచ్చితంగా అది ఎన్టీఆర్ స్టామినా అనే చెప్పాలి.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన దేవర కలెక్షన్స్ పరంగానూ ఎన్టీఆర్ కు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ వంటి వారు పరిచయం అయ్యారు. అనిరుధ్ మ్యూజిక్ ఓ హైలెట్ గా నిలిచిన దేవరకు సెకండ్ పార్ట్ కూడా ఉంది. మొత్తంగా 50 రోజుల పోస్టర్స్ అరుదైన టైమ్ లో హాఫె సెంచరీకి పైగా థియేటర్స్ లో 50 రోజులు ఆడటం అంటే ఈ రోజుల్లో చిన్న విజయం అయితే కాదు.



Tags

Next Story