Devara : ఇది 'దేవర' విధ్వంసం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 27న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చింది. దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ సోలి హీరోగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకుల నుండి పాజిటీవ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది దేవర. అదే రేంజ్ లో మొదటిరోజు కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ఈమేరకు తొలిరోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఆ లెక్కల ప్రకారం దేవర సినిమా మొదటిరోజు ఏకంగా రూ.172 కోట్ల భారీ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఇదే హైయెస్ట్ కావడం విశేషం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com