NTR Devara : దేవరకు పర్మిషన్ వచ్చింది

NTR Devara :  దేవరకు పర్మిషన్ వచ్చింది
X

భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాలు భలే మద్ధతునిస్తున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ లో అన్ని పెద్ద సినిమాలూ లాభం పొందుతున్నాయి. ఇంతకీ ట్రెండ్ ఏంటో తెలుసు కదా.. యస్.. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం తెలిసిన వాళ్లెవరైనా సరే.. దేవరకు అక్కడ టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వరు అనుకున్నారు. అలాగే రీసెంట్ గా మిడ్ నైట్ షోస్ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందనే కమెంట్స్ కూడా వినిపించాయి. దీంతో దేవరకు ఏపిలో షాక్ తప్పదేమో అనుకున్నారు. బట్ అలా ఏం జరగలేదు. అన్ని రకాల పర్మిషన్స్ అక్కడ కూడా వచ్చాయి.

మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఏపి ప్రభుత్వం. అలాగే రిలీజ్ రోజున (సెప్టెంబర్ 27న) అర్థరాత్రి నుంచి 6 షోస్ ప్రదర్శించుకునే అనుమతి కూడా వచ్చింది. అలాగే 28 నుంచి 9 రోజుల పాటు 5 షోస్ ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఎన్టీఆర్ ను కాస్త దూరం పెట్టారు చంద్రబాబు అనే మాటలు అబద్ధం అని తేలిపోయాయి. విశేషం ఏంటంటే.. ఈ ప్రదర్శనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి తన ఎక్స్ ఖాతాలో థ్యాంక్స్ చెప్పాడు ఎన్టీఆర్.




Tags

Next Story