NTR Devara : ఈ సీక్రెట్స్ అన్నీ సీక్వెల్ లో రివీల్ అవుతాయా దేవరా

NTR Devara :  ఈ సీక్రెట్స్ అన్నీ సీక్వెల్ లో రివీల్ అవుతాయా దేవరా
X

వాల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దేవర రూలింగ్ కనిస్తోంది. రికార్డులు కొల్లగొడుతున్నాడు. లాంగ్ వీకెండ్ తో పాటు దసరా హాలిడేస్ కూడా కలిసి రావడంతో దేవర ఓవరాల్ కలెక్షన్స్ నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. అయితే దేవర సెకండ్ హాఫ్ పై చాలామందిలో ఓ నిరాశ కనిపిస్తోంది. అనుకున్నంత బలంగా లేదు అంటున్నారు. క్లైమాక్స్ కూడా మేకర్స్ చెప్పినంత ఎగ్జైటింగ్ లేదు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా శెలవులు కాబట్టి దేవరకు బాగా కలిస్తుందని మాత్రం చెప్పొచ్చు. అయితే దేవర 2కు సంబంధించి అద్భుతమైన పాయింట్స్ కనిపిస్తున్నాయి. దేవరలో సీక్వెల్ లీడ్స్ గా ఉన్నా పాయింట్స్ చూస్తే దేవర 2 మరింత బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు చాలామంది. ఇంతకీ ఆ పాయింట్స్ ఏంటో తెలుసా..? దేవర ఆరంభంలోనే రా ఏజెన్సీ సమావేశమై.. యతి, దయా గురించి మాట్లాడుకుంటారు. వీరిలో యతిని పట్టుకుంటే దయా ఆచూకీ చెబుతాడు. అతన్ని వెదుక్కుంటూ వెళ్లిన వీరికి దేవర కథ వినాల్సి వస్తుంది. అది కూడా ఓ డిస్మిస్డ్ డిఎస్పీ ద్వారా. అతని కాలు పనిచేయదు. మొహం పగిలిపోయి ఉంటుంది. అతను చెప్పిన దాన్ని దేవరలో వీరికి ఓడలపై పని ఇచ్చే మురుగన్ చనిపోతాడు. అతనెలా చనిపోయాడు అనేది ఓ పాయింట్ అయితే డీఎస్పీని ఇలా చేసింది ఎవరు అనేది మరో పాయింట్. యతి సోదరుడు దయా ఏమయ్యాడు.. అనేది మరో కోణం. అన్నిటికీ మించి సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి..? అలా చేసింది ఎవరు..? ఇంక ప్రకాష్ రాజ్ పాత్రేంటీ అనేది ఫస్ట్ పార్ట్ లో క్లియర్ గా లేదు. సెకండ్ పార్ట్ లో దానికి సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది. అన్నిటికీ మించి అసలు దేవర, వర చనిపోయారా లేదా అనేది. సో.. ఇవన్నీ బలమైన కోణాలే. ఈ సారి మరింత జాగ్రత్తగా కథ, కథనాలు రాసుకుంటే దేవర కూడా బాహుబలి 2 లాగా ఫస్ట్ పార్ట్ కు మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది.

Tags

Next Story