Devara 2nd day Collections : తెలుగు రాష్ట్రాల్లో దేవర రెండో కలెక్షన్స్ ఎంత

ఫస్ట్ డే అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద ఊచకోత అనిపించాడు దేవర. ఎన్టీఆర్ నటనకు తోడు అనిరుధ్ ఆర్ఆర్ తోడై కొన్ని సీక్వెన్స్ ను నెక్ట్స్ లెవల్లో చూపించాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లు వసూళ్లు సాధించింది దేవర. దీంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లో ఆర్ఆర్ఆర్ తర్వాతి స్థానంలో నిలిచి అన్ని రికార్డులు బద్ధలు కొట్టింది. మరి రెండో రోజు ఈ కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయా అంటే లేదనే చెప్పాలి. అఫ్ కోర్స్ ఫస్ట్ డే మిడ్ నైట్ షోతో పాటు ఎర్లీ మార్నింగ్ షో కూడా ఉండటం కూడా కలిసొచ్చింది. రెండో రోజు రెండు షోస్ మిస్ అయ్యాయి కాబట్టి అది కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. అలాగని పూర్తిగా డౌన్ అయిపోలేదు.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే..
నైజాం - 6. 94 కోట్లు
వైజాగ్ - 1. 68 కోట్లు
సీడెడ్ - 3. 77 కోట్లు
ఈస్ట్ - 0. 86 లక్షలు
వెస్ట్ - 0. 48 లక్షలు
కృష్ణా - 0. 95 లక్షలు
గుంటూర్ - 0. 82 లక్షలు
నెల్లూర్ - 0.62 లక్షలు
టోటల్ ఏపి/ తెలంగాణ కలిపి - 16. 12 కోట్లు షేర్ వసూళ్లు సాధించింది దేవర. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రోజుల్లోనే 70. 33 కోట్లు వసూళ్లు సాధించి దేవర సత్తా చాటింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com