Jr. NTR : సాయంత్రమే దేవర సాంగ్

Jr. NTR : సాయంత్రమే దేవర సాంగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర నుంచి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా ఎదురుచూస్తోన్న సెకండ్ సింగిల్ కు టైమ్ వచ్చేసింది. ఈ పాట కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ దేవర నుంచి వచ్చిన అప్డేట్ ఏదీ సరైన కిక్ ఇవ్వలేదు అనే చెప్పాలి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ లో రక్తపాతం కూడా భయపడే రేంజ్ హై డోస్ యాక్షన్ కంటెంట్ తో రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇక అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ పైనా అంచనాలున్నాయి. కొన్నాళ్లుగా అనిరుధ్ నేపథ్య సంగీతంతోనే సినిమాలను నిలబెడుతున్నాడు. కొన్ని మూవీస్ లో మేటర్ లేకపోయినా అతని ఆర్ఆర్ తోనే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అతని సంగీతంలో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మూవీ అంటే ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా చూస్తోంది. అయితే అతను గతంలో సంగీతం అందించిన అజ్నాత వాసి, నాని గ్యాంగ్ లీడర్ ఆకట్టుకోలేదు. జెర్సీ మాత్రం కంటెంట్ బలంతో కమర్షియల్ గా వర్కవుట్ అయింది.

అయితే ఈ సాంగ్ ఇంత ఆలస్యం కావడానికి కారణం కూడా అనిరుధ్ అనే చెబుతున్నారు. విపరీతమైన సినిమాలు ఒప్పుకుని ఉండటంతో అతను ఇన్ టైమ్ లో ఈ మూవీకి వర్క్ అందించలేపోతున్నాడంటున్నారు. ఏమైతేనేం సినిమాపై అంచనాలు పెంచే బాధ్యతతో ఉన్న ఈ సాంగ్ ఈ సోమవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల కాబోతోంది. దేవర గురించి ఉన్న అంచనాలకు భిన్నంగా ఇది పూర్తిగా రొమాంటిక్ ట్రాక్ తో సాగే సాంగ్ అని ముందే చెప్పారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story