Devara 2nd Song : దేవర సెకండ్ సాంగ్.. తుస్సుమనిపించిన అనిరుధ్

Devara 2nd Song : దేవర సెకండ్ సాంగ్.. తుస్సుమనిపించిన అనిరుధ్

అంతన్నాడు ఇంతన్నాడే అంటూ ఓ ఫోక్ సాంగ్ ఉంది మన తెలుగులో. ఆ మాట ఇప్పుడు అనిరుధ్ కు సరిగ్గా సరిపోతుంది. ఆ మాటకొస్తే దేవర టీమ్ మొత్తానికీ ఆపాదించొచ్చు. సెకండ్ సింగిల్.. సెకండ్ సింగిల్ అంటూ చాలా రోజుల పాటు ఊరించారు. అభిమానులకు కోపం వచ్చి ఆ మాటే అడగడం మానేశారు. అప్పుడు లైన్ లోకి వచ్చి ఇదుగో వచ్చేస్తోంది.. సంగీత దర్శకుడు అనిరుధ్ అద్భుతమైన పాట ఇస్తున్నాడు.. అందుకే ఇంత లేట్ అన్నారు. తీరా చూస్తే పాట వచ్చింది. బట్ మినిమంగా కూడా ఆకట్టుకునేలా లేదీ సాంగ్.

మామూలుగా స్టార్ హీరోల సినిమాల నుంచి పాటలంటే లిరికల్ వీడియోస్ ఉంటాయి. బట్ దేవర నుంచి మాగ్జిమం వీడియో సాంగ్ ఉంది. బట్ అది ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. హీరోతో ప్రేమలో పడ్డ హీరోయిన్ పాడుకునే పాట ఇది. చాలా అంటే చాలా రొటీన్ గా ఉంది తప్ప.. ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ స్థాయికి ఏ మాత్రం తగినట్టు లేదు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని శిల్పారావు పాడింది. అనిరుధ్ కంపోజిషన్ అతని స్థాయికి అస్సలే మాత్రం తగ్గట్టుగా లేదు. ఇక డ్యాన్స్ మూమెంట్స్ అయితే డ్యాన్స్ లు రాని హీరోల కోసం కొరియోగ్రాఫర్స్ కష్టపడి చిన్న చిన్న మూమెంట్స్ కంపోజ్ చేస్తారు కదా.. అలా ఉంది. ఎన్టీఆర్, జాన్వీల మధ్య కెమిస్ట్రీ ఆర్టిఫిషియల్ గా ఉంది. తనేమో మొత్తం ఎక్స్ పోజింగ్ తోనే కనిపించడంతో అందులో లవ్ కంటే లస్ట్ ఎక్కువగా ఎలివేట్ అవుతోంది. పోనీ పాట స్లోగా ఉంది కదా.. అందుకు తగ్గట్టుగా డ్యాన్స్ ఉందనుకోవడానికీ లేదు. ఇలాంటి సాంగ్స్ లో కూడా అద్భుతమైన హుక్ స్టెప్స్ తో అదరగొడుతున్న హీరోలను చూస్తున్నాం కదా..

ఏదేమైనా దేవర నుంచి వచ్చన ఫస్ట్ లిరికల్ ఇంగ్లీష్ లో ఉండి ఎక్కలేదు. ఇదేమో చాలా సాధారణ ట్యూన్ తో తుస్సుమనిపించాడు అనిరుధ్. నిజానికి ఈ పాట చూస్తుంటే అనిరుధ్ వర్క్ పైనే అనుమానం కలుగుతోంది. ఏదేమైనా ఓ పుష్పలాగా ఈ పాటతో హైప్ వస్తుందనుకుంటే ఇంకా డౌన్ అయింది. దీనికంటే తమన్ బాబు అందించిన జరగండి జరగండి పాటే బెటర్ గా ఉందనిపిస్తే తప్పేం లేదు. అది కనీసం ట్రోల్స్ తో అయినా జనం నోళ్లలో ఎక్కువగా నానుతుంది. మొత్తంగా దేవరకు అసలే బజ్ లేదంటే ఈ పాటతో మరింత దెబ్బేశాడు అరవబ్బాయి అనిరుధ్. ఇంక దేవరను ఆ ఎన్టీవోడే కాపాడుకోవాలేమో.

Tags

Next Story