Devara : దేవర సాంగ్ .. ఎవరీ దేవత?
దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కొత్త బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను జాన్వీ తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఈ పాట చూసిన జాన్వీ స్నేహితుడు.. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియా చేసిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. వీడియోను లైక్ చేసిన శిఖర్.. 'వావ్.. ఎవరీ దేవత' అని కామెంట్ పెట్టారు. 'దేవర క్రియేట్ చేసిన ఓ డ్రగ్ ( చుట్టమల్లే సాంగ్)కు అడిక్ట్ అయ్యాను. నన్ను ఏదీ క్యూర్ చేయలేక పోతోంది. వెంటనే పాట పాడిన శిల్పారావు, కంపోజర్ అనిరుధ్ పై కేసు పెట్టండి' అంటూ ఓ అభిమాని సైబరాబాద్ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. దీనికి సింగర్ శిల్ప లవ్ సింబల్ తో బదులిచ్చారు. ఈ పాట అటు యూట్యూబ్లోనూ రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్లో కి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ట్రెండింగ్లో నం.1లో కొనసాగుతోంది. 45 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com