Jr. NTR : దేవర పాట తిప్పలు, హైప్ కోసమేనా..

Jr. NTR : దేవర పాట తిప్పలు, హైప్ కోసమేనా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా దేవర. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కు సంబంధించి జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి ఓ చిన్న టీజర్ మాత్రమే వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా. కానీ ఆ స్థాయిలో హైప్ కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా విడుదల కాలేదు. ఇతర హీరోల సినిమాలు చూస్తే ప్రమోషనల్ గా దూకుడుగా ఉన్నాయి. దేవర1 విషయంలో ఆ దూకుడు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ మినిమం బజ్ క్రియేట్ కాలేదీ మూవీపై. ఇది కొంత వరకూ ఆశ్చర్యంగానే ఉన్నా.. పాటల విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ వల్లే లేట్ అవుతుందంటున్నారు. అందులో నిజాలేంటనేది పక్కన బెడితే లేటెస్ట్ గా ఈ మూవీలో దేవర క్యారెక్టరైజేషన్ ను తెలిపే ఫియర్ సాంగ్ లో ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ మీకోసం ప్రేమగా అంటూ.. రెండో చరణం రాశా అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తన ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశాడు. అతనేం రాశాడో మీరూ చూడండి.చరణం :

అతడొక పాంచజన్య శబ్ధం

కోతకు సిద్ధమైన యుద్ధం

గమనం దమనం సకలం కలకలం

చకచక అతని చాకచ్యం

అసురుల ఊచకోత తథ్యం

విలయం ప్రళయం నిజమా భుజబలం

అవసరం భయమనేది లేకుంటే మరణమే

భువిపై నీ ఉనికి

అతడిచ్చిన అభయమేదేవర మౌనమే సవరణ లేనిహెచ్చరిక

రగిలిన మౌనమే మృత్యువుకైన ముచ్చెమటఇదీ రామజోగయ్య శాస్త్రి రాసిన చరణం. చూడ్డానికి పవర్ ఫుల్ గానే ఉంది. కానీ దీనికి అంతే పవర ఫుల్ గా ట్యూనూ ఉండాలి. ఈ మధ్యే భారతీయుడు 2 అనిరుద్ మ్యూజిక్ చూసి అంతా అబ్బే బాలేదు అనేశారు. పైగా కొన్నాళ్లుగా అతని ట్యూన్స్ అన్నీ ఒకే తరహాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ మూవీస్ లో. ఏదేమైనా పాట వస్తే కిక్ వస్తుంది కానీ.. ఇలా పల్లవులు, చరణాలు అంటూ సోషల్ మీడియాలో అక్షరాలు పోస్ట్ చేస్తే హైప్ వస్తుందా.. ?

Tags

Next Story