Devara : ఇదెక్కడి మాస్‌రా మావ.. బియాండ్ ఫెస్ట్‌లో దేవర రెడ్ కార్పెట్ ప్రీమియర్..
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర చిత్రం విడుదలకు ముందుగానే అనేక రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం భారతీ ప్రేక్షకులే కాదు విదేశీ సినీ ప్రేమికులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిసున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మించారు. జాన్వీకపూర్ హీరోయిన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.
'దేవర' రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో దేవర పార్ట్ 1' ట్రైలర్ కు అన్ని భాషల్లో మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో 'దేవర' ప్రీమియర్ షోను సెప్టెంబర్ 26 సాయంత్రం బియాండ్ ఫెస్ట్ హాలీవుడ్, లాస్ ఏంజిల్స్లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ ఘనమైన సినిమా చరిత్రను కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. ఇలాంటి వేదికలో రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగటం అరుదైన విషయం.
అలాగే ఇక్కడ ప్రీమియర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా 'దేవర' మరో ఘనతను సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న 'దేవర' చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com