Devara : దేవరకు రికార్డు వ్యూస్.. ట్రైలర్ కు అద్భుత స్పందన
మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర మూవీ ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ట్రైలర్ మంగళవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది. తారక్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ, విజువల్ ఫీస్ట్ అందించాయి. మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షార్క్ తో ఎన్టీయార్ పోరాడే సీన్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గ నిలిచింది. ఇప్పటివరకు దేవర 35 మిలియన్ వ్యూస్ రాబట్టి గ్లోబల్ లెవల్ లో ట్రేండింగ్ లో ఉంది. య్యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ సినిమాల సరసన దేవర టాప్ లి నిలిచింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com