Devara 1 Trailer date : దేవర ట్రైలర్ డేట్ ఫిక్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర 1 ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీతో తారక్ అన్ని ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని చాలామంది భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోన్న మూవీ కాబట్టి ప్యాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ కూడా దేవర కోసం చూస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్స్ లో గ్లింప్స్ ఆకట్టుకుంది. విలన్ పరిచయం బావుంది. బట్ సాంగ్స్ మాత్రం కొంత డిజప్పాంట్ చేశాయి. బట్ ఇలాంటి యాక్షన్ మూవీస్ లో పాటలతో పెద్దగా పని ఉండదు. అందువల్ల మరీ ఇబ్బందేం ఉండకపోవచ్చు. ప్రస్తుతం దేవరపై కొంత నెగెటివ్ ప్రచారం జరుగుతోందనేది నిజం. అఫ్ కోర్స్ కొన్ని ఖచ్చితంగా ఉన్నాయి. మరికొన్ని కావాలని చేస్తున్నవి ఉన్నాయి. ఇవన్నీ పక్కన బెడితే ఈ నెల 27నే విడుదల కాబోతోన్న దేవర ప్రచారం భారీ స్థాయిలో జరగాల్సి ఉంది. ఆ మేరకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా చేయాలి. అందుకే ముందు ట్రైలర్ వస్తే ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టొచ్చు.
ట్రైలర్ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. బట్ ఫైనల్ గా ఈ నెల 10న దేవర ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గానే ప్రకటించింది టీమ్. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ చేతిలో ఆయుధంతో ‘వినమ్ర విధ్వంసకుడు’లా ఉన్న ఎన్టీఆర్ ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటోతో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. చాలామంది ఈ డేట్ కే ట్రైలర్ వస్తుందని ఊహించారు కూడా. ఊహించినట్టుగానే అదే డేట్ ను ఫిక్స్ చేశారు. సో.. ట్రైలర్ వస్తే సినిమాపై ఒక అంచనాకు రావొచ్చు. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ట్రైలర్ కట్ చేసిన మేకర్స్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com