Devara Trailer Date : సెప్టెంబర్ 10న దేవర టైలర్?
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా దేవర'. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కాబోతోంది. నిన్న ఈ సినిమా మూడోపాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దాంతో మేకర్స్ సైతం ట్రైలర్ ను ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రిలీజ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. అద్భుతమైన విజువల్స్ తో, భారీ యాక్షన్, డైలాగ్స్ తో సూపర్ ట్రైలర్ ను మేకర్స్ కట్ చేశారని టాక్. సెప్టెంబర్ 10న దేవర టైలర్ ను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్న విడుదలైన మూడో పాట.. దావూదీ.. దావూదీ సాంగ్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. జాన్వీ అందాలు కూడా పాటకు హైలెట్ గా నిలుస్తున్నాయని చెబుతున్నారు. పాట రిలీజ్ అయిన నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఫియర్ సాంగ్, చుట్టమల్లే సాంగ్ రేంజ్ లో దావూదీ పాట కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని ట్రెండింగ్ లో దూసుకెళ్తాంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com