దేవరాజ్ రెడ్డి వద్ద RX100 అశోక్ రెడ్డి, శ్రావణిల వీడియోలు, ఫోటోలు

దేవరాజ్ రెడ్డి వద్ద RX100 అశోక్ రెడ్డి, శ్రావణిల వీడియోలు, ఫోటోలు
టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకేసు దర్యాప్తును S R నగర్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు..

టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకేసు దర్యాప్తును S R నగర్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు రెడ్డిని విచారిస్తున్నారు. దేవరాజురెడ్డి SR నగర్ పోలీస్టేషన్‌ లో విచారణకు హాజరయ్యారు. శ్రావణిని ఫోన్‌లో బెదిరించిన ఆడియో... ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి తో శ్రావణి చెప్పిన అంశాల ఆధారంగా పోలీసులు దేవరాజ్‌ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా దేవరాజ్, సాయి రెడ్డి కామెంట్స్‌ పై పోలీసులు దృష్టి సారించారు. వీరి బెదిరింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేవరాజ్ రెడ్డి విచారణ తర్వాత సాయి, శ్రావణి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించనున్నారు. వారి స్టేట్ మెంట్స్ రికార్డుచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి- శ్రావణిల ఆడియో టేపులు, వీడియోలను సేకరించిన పోలీసులు... ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలను బయట పెడుతానని దేవరాజ్ రెడ్డి బెదిరిస్తున్నాడని శ్రావణి, సాయిరెడ్డి చెప్పిన మరో ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సాయిరెడ్డి తోపాటు అశోక్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మరోవైపు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నదేవరాజ్ రెడ్డి వద్ద శ్రావణి, అశోక్ రెడ్డీలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి అడ్డుపెట్టుకొని శ్రావణిని దేవరాజు బెదిరించినట్లు ఫోన్ సంభాషణల్లో వెలుగులోకి వచ్చాయి. అయితే సాయి, శ్రావణి మధ్య సంబంధాలు ఏమిటి..? శ్రావణి- దేవరాజ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story