Devara : దేవర సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..

Devara : దేవర సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ దేవర 1. ఫస్ట్ ఒకే పార్ట్ గా స్టార్ట్ అయిన ఈ మూవీని కొన్నాళ్ల తర్వాత రెండు భాగాలుగా వస్తుందని అనౌన్స్ చేశారు. పైగా ఏప్రిల్ 5న రావాల్సిన మూవీని సెప్టెంబర్ 27కి పోస్ట్ పోన్ చేశారు. అయితే రిలీజ్ ఇంకా రెండు నెలలే ఉన్నా ఈ మూవీపై ఇప్పటి వరకూ మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు అనేది వాస్తవం. అసలు ఈ కాంబినేషన్ పైనే క్రేజ్ లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు అన్నప్పుడు కూడా హైప్ రాలేదు. మరి ఈ హైప్ ను పెంచాలంటే పుష్ప మూవీలాగా ఒక క్రేజీ సాంగ్ లేదంటే ఏదైనా పవర్ ఫుల్ టీజర్ ఇస్తూ ఉంటే బజ్ వస్తుంది. ఈ విషయంలో కూడా దేవర టీమ్ డల్ గానే ఉందని ఫ్యాన్స్ అంతా ఫీలవుతున్నారు. అలా ఫీలయ్యే వారికోసమే ఈ అప్డేట్.

యస్.. చాలా రోజులుగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూస్తోన్న దేవర నుంచి రెండో పాటకు రంగం సిద్ధం అయింది. ఆగస్ట్ 2 లేదా 3 తేదీల్లో దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది మూవీ టీమ్ నుంచే అఫీషియల్ గా వచ్చిన అప్ డేట్. కాకపోతే వాళ్లుసరైన డేట్ చెప్పలేదు. మరికొన్ని రోజుల్లో అని మాత్రం అన్నారు. అది ఈ రెండు డేట్స్ లోనే ఉంటుందనే సమాచారం.

ఇక ఈ సాంగ్ లేట్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అనేది అంతా చెబుతున్న మాట. అతను ఆల్రెడీ ఇచ్చిన ఫస్ట్ లిరికల్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో సెకండ్ సాంగ్ పై దేవర టీమ్ అంతా హోప్స్ పెట్టుకుంది. ఇటు ఫ్యాన్స్ కూడా ఈసాంగ్ క్రేజీగా ఉంటే తప్ప ఇతర హీరోల అభిమానుల ముందు తలెత్తుకోలేం అని భావిస్తున్నారు. ఈ పాట డ్యూయొట్ గా ఉంటుందని టాక్. రీసెంట్ గానే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు కూడా. అందువల్ల ఒకట్రెండ్ స్టెప్పులు కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. ఏదేమైనా ఎన్నాళ్లో వేచిన అప్డేట్ వచ్చింది., ఇక పాట ఎలా ఉంటుంది అనేదే పాయింట్.

Tags

Next Story