Devi Sri Prasad : మహేష్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇష్టం ఉండనిది ఎవరికి. ప్రతి ఒక్కరికీ నచ్చే పాటలతో అదరగొడుతుంటాడు దేవీ. క్లాస్ అయినా మాస్ అయినా కంటెంట్ ను కంపోజ్ చేయడంలో ఎక్స్ పర్ట్ అతను. అతని సంగీతం సినిమాల్లోనే కాదు.. వేదికలపైనా అదిరిపోతుంది. ఈ కారణంగానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ తోనే ఈ శనివారం హైదరాబాద్ లో ఓ కాన్సర్ట్ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో సహా ఎంతోమంది ప్రముఖులను కలిసి స్వయంగా ఆహ్వానం అందించాడు కూడా. మామూలుగా దేవీ శ్రీ ప్రసాద్ కాన్సర్ట్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో హైదరాబాద్ కాన్సర్ట్ కు కూడా అంతే క్రేజ్, క్రౌడ్ వచ్చింది.
కాన్సర్ట్ అంతా బానే ఉన్నా.. మహేష్ బాబు ఫ్యాన్స్ ను మాత్రం బాగా డిజప్పాయింట్ చేశాడట దేవీ శ్రీ ప్రసాద్. కారణం ఏంటంటే.. ఈ కాన్సర్ట్ లో మహేష్ బాబు పాటలు లేవట. ఏదో తూతూ మంత్రంగా ఒకటో రెండో పాటలు మాత్రమే ఉన్నాయని ఫీలవుతున్నారు వాళ్లు. దేవీ ఇలా చేస్తాడు అనుకుంటే అసలు కాన్సర్ట్ కే వచ్చేవాళ్లం కాదు అంటున్నారు. 2014లో వచ్చిన ఒన్ నేనొక్కడినే దేవీ, మహేష్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ. సినిమా పోయినా.. ఆడియో బ్లాక్ బస్టర్. తర్వాత శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించాయి. ఆల్బమ్స్ కూడా హిట్. ఇన్ని హిట్స్ సాంగ్స్ నుంచి మహేష్ కు పెద్దగా స్థానం లేదు అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి కేవలం మహేష్ అభిమానులే ఇలా ఫీలవుతున్నారా లేక ఇంకెవరైనా హీరోల అభిమానులు కూడా అలాగే ఫీలవుతున్నారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com