Devi Sri Prasad: భవదీయుడు భగత్‌సింగ్‌కి భారీగా.. 'తగ్గేదేలే' అంటున్న 'దేవీశ్రీ'

Devi Sri Prasad: రాక్‌స్టార్ దేవీశ్రీ మ్యూజిక్‌కి ఫిదా అవని కుర్రకారు ఉంటుందా.. పాట వింటే ఊపొచ్చేయాల్సిందే. ఐటెం సాంగ్ అయినా ఆఫ్ బీట్ సాంగ్ అయినా దేవీశ్రీ కంపోజ్ చేసిన పాట అంటే యువతలో ఫుల్ క్రేజ్. ఇక పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్, దేవీశ్రీ కలిస్తే సరిగమలకి కొత్త సొబగు అద్దినట్లవుతుంది.
మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేసి డీఎస్పీ.. డైలాగ్ డెలివరీతో, యాక్టింగ్‌తో ఇరగదీసే పవన్ కలిస్తే అభిమానులకు పండగే.. వీరిద్దరి కాంబోలో వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు మ్యూజికల్‌గా కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. కేవలం ఆయన అందించిన సంగీతంతో కూడా హిట్టయిన సినిమాలు ఉన్నాయి. అందుకే ఆయనకు టాలీవుడ్‌లో మస్తు డిమాండ్.
ఇక ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పాటలు ఎంత పాపులర్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి డీఎస్పీ బాణీలు అందించబోతున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భవదీయుడు భగత్ సింగ్. ఈ చిత్రం కోసం దేవీ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
ఈ సినిమా కోసం దేవీ రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే భవదీయుడు కోసం బాగా కష్టపడుతున్నారు డీఎస్పీ. పవన్ ఫ్యాన్స్‌కి మంచి సంగీతం అందించే పనిలో ఉన్నారు దేవీ. ఇప్పటికే రెండు పాటలను కంప్లీట్ చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు దేవీశ్రీ ప్రసాద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com