సినిమా

Devi sri prasad : దేవిశ్రీప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు

ఆయన బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Devi sri prasad : దేవిశ్రీప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు
X

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఆయన బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మరణవార్త వినగానే మరోవార్త శోకసంద్రంలోకి నెట్టేసింది. దేవిశ్రీప్రసాద్ బాబాయ్ మరణవార్త వినగానే తన మేనత్త కోమ్ముల సీతామహలక్ష్మి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీనితో దేవి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతగారి పేరు నారాయణ కమ్యూనిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. మొత్తం ఆరుగురు సంతానం. కాగా ప్రస్తుతం పుష్పతో పాటుగా పలు సినిమాలకి సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు దేవి.

Next Story

RELATED STORIES