Yera Cheera : 'ఎర్రచీర' వెనుక ఉన్నదెవరో ఆ రోజు చెప్పేస్తారట

Yera Cheera : ఎర్రచీర వెనుక ఉన్నదెవరో ఆ రోజు చెప్పేస్తారట
'ఎర్రచీర' మూవీపై క్రేజీ అప్ డేట్

అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న 'ఎర్రచీర' మూవీపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా.. తాజా అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలోని ఎర్రచీర వెనుక ఉన్న ఆ దయ్యం(రాక్షసి) ఎవరో త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఆగస్టు 30న అదెవరో చెప్తామంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఎర్రచీర ఎగురుతూ ఉన్నట్టు కనిపిస్తుండగా.. టైటిల్ తో పాటు ఆ వ్యక్తిని ఆగస్టు 30న సాయంత్రం 4.05గంటలకు రివీల్ చేస్తామని ఉంది. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 9న తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరో శ్రీరామ్, అయ్యప్ప పి.శర్మ, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా బేబీ డమరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

36నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని నిర్మాతలు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు ఇంతకుమునుపే వెల్లడించారు. ఇక 'ఎర్రచీర' సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన 'శివ శివ శంభో శంకర', 'రొమాంటిక్ సాంగ్ గా వచ్చిన తొలి తొలి ముద్దు.. ముద్దుపైన 150 ముద్దులు అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు కె. సత్యసుమన్ బాబు లిరిక్స్ అందించగా.. సౌమ్య, హేమ చందర్ పాడారు. కుటుంబ బాంధవ్యాలకు, అనురాగాలకు పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు ఇంతకుమునుపే వెల్లడించారు. కుటుంబ కథే అయినా.. హారర్ థ్రిల్లింగ్ అంశాల్ని కూడా జోడించామని, వాణిజ్యాంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని చెప్పారు. ప్రమోద్ అంచిన స్వరాలు సినిమాకు ప్రధాన బలం అని, సినిమాలోని పాటల లిరిక్స్ ప్రేక్షకుల్లోకి లోతుగా దూసుకువెళ్తాయని చెప్పారు.


Next Story