Devil: ఉత్కంఠ రేపుతోన్న కళ్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్

బింబిసారతో హిట్టు కొట్టిన నంమూరి కళ్యాణ్ రామ్ మరో ఆసక్తికర కథనంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గూడాచారి నేపథ్యంలో డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా డెవిల్ గ్లింప్స్ ను చిత్ర యునిట్ విడుదల చేసింది. బ్రిటీష్ కాలంలో గూడాచారిగా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. గ్లింప్స్ వీడియో ఆయన అభిమానులను సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది.
గ్లింప్స్ లో... మీరు చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతన ఉండదేంటి సరే... అన్న దానికి బదులుగా... "మనసులో ఉన్న భావన, ముఖంలో తెలియకూడదు... మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు.. అదే గూఢాచారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం" అని కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ నెటిజన్లను ఉర్రూతలూగిస్తోంది. బింబిసార తర్వాత అంతటి ఎనర్జీ ఉన్న సినిమాగా డెవిల్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. నవీన్ మేడవరం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమకు అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com