Dhanush 51: ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో ధనుష్ 51

Dhanush 51: ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో ధనుష్ 51
X
ధనుష్ 51 వ చిత్రం ఫస్ట్ పోస్టర్ విడుదల

'సార్‌' మూవీతో తెలుగులో సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయం దక్కించుకుని, తిరుగులేని మార్కెట్‌ను పెంచుకున్న హీరో ధనుష్‌ మరో కొత్త తెలుగు సినిమాతో రానున్నాడు. ఈ విషయాన్ని గత నెల రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ.. మూవీపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై 28న ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఓ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ధనుష్ 51వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి ప్రస్తుతం 'D51' అనే టైటిల్ పెట్టారు.

లెజెండరీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ జయంతి సందర్బంగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 'D51' ను నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ(ఏషియన్ గ్రూప్) లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ ను ఇంతకు మునుపు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించబోతున్నారనే టాక్ కూడా వస్తోంది.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్ విషయానికొస్తే.. ఓ పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో నగరం కనిపిస్తుండగా.. మధ్యలో నొట్ల కట్టలు.. కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఆయన సినిమాలకు ఇక్కడ మాములు గిరాకీ లేదు. కెప్టెన్‌ మిల్లర్‌ కోసం ఇప్పటి నుంచే తెలుగు నిర్మాతలు కాచుకొని చూస్తున్నారు. డబ్బింగ్‌ హక్కుల కోసం ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక శేఖర్‌ కమ్ములతో చేయబోయే సినిమాకైతే మాములు ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు. అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేసి నెలలు గడిచిపోయింది. ఎప్పుడెప్పుడు సెట్స్‌ మీదకు వెళ్తుందా అని అమితాసక్తితో ఎదురు చూస్తు్న్నారు. ఇక ధనుష్ ప్రస్తుతం కేప్టెన్‌ మిల్లర్‌తో తాను స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.


Tags

Next Story