Dhanush Aishwaryaa love story: అలా మొదలైంది.. చివరికి ఇలా అయ్యింది..

Dhanush Aishwaryaa Love Story: ఆమె అప్పటి కొలీవుడ్ ఇండస్ట్రీలని ఏలేస్తున్న స్టార్ హీరో రజనీకాంత్ కూతురు.. ఇతడేమో అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న అప్‌కమింగ్ హీరో.. ఇద్దరి పరిచయం ఎంతో విచిత్రం. ధనుష్ నటించిన 'కాదల్ కొండేన్' చిత్రం రిలీజ్ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. ఆ చిత్ర నిర్మాత ధనుష్‌కు ఐశ్వర్యను పరిచయం చేశారు. ఆ తర్వాత అతడి నటనను ప్రశంసిస్తూ ఐశ్వర్య ఓ లెటర్‌ను, బొకేను ధనుష్‌కు పంపించింది. అలా వారిద్దరి మధ్య ముందు స్నేహం, ఆ తర్వాత ప్రేమ మొదలైంది. ఆ సమయంలో వారిద్దరి గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
ఇద్దరూ ఆర్నెలు డేటింగ్ కూడా చేసారు.. తమ ఇద్దరి మధ్యా ఏ సంబంధం లేదంటూ ఎక్కడ చూసినా వాళ్లిద్దరే చెట్టాపట్టాలేసుకుంటూ కనిపించేవారు. కెమెరా ఫోకస్ అంతా వారిమీదే ఉండడంతో ఇక లాభం లేదని పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2014లో ఐశ్వర్య మెడలో మూడు ముళ్లు వేశాడు ధనుష్.
అతడి కంటే ఆమే పెద్ద..
పెళ్లి సమయానికి ధనుష్‌కి 21 ఏళ్లు అయితే ఐశ్వర్యకు 23 ఏళ్లు. అయితే ఈ ఏజ్ గ్యాప్ వారి ప్రేమకు, వాళ్ల పెళ్లి ఏ మాత్రం అడ్డు రాలేదు.
18 ఏళ్ల కాపురంలో ఇద్దరు పిల్లలు పుట్టారు.. పెద్దవాడు యాత్రకు 15 ఏళ్లు ఉండగా, చిన్న కొడుకు లింగకు 11 ఏళ్ల వయసు. ధనుష్‌కు పిల్లలంటే చాలా ప్రేమ. వాళ్లిద్దర్నీ తన స్నేహితులని చెప్పుకుంటాడు. ఇంట్లో ఉంటే వాళ్లని స్కూలుకు తీసుకువెళ్లడం, ఇంటిని తీసుకురావడం పిల్లలకు సంబంధించిన ప్రతి పనిని చాలా ఇష్టంగా చేస్తాడు ధనుష్.
కాపురంలో కలతలు..
అన్యోన్యంగా ఉండే కుటుంబం విచ్ఛిన్నం కావడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.. ఐశ్వర్య తప్పేంలేదు.. ధనుష్‌దే అంతా అని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఏది ఏమైనా ఇది 60 దాటిన రజనీకి అనుకోని దెబ్బ.. పెద్ద కూతురు సౌందర్య కూడా విడాకులు తీసుకుంది ఓ బిడ్డకు తల్లయ్యాక.. ఇప్పుడు చిన్న కూతురు సౌందర్య పరిస్థితి కూడా ఇలా అయ్యేసరికి ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారు రజనీ కాంత్.. ఓ పక్క అనారోగ్యం, అనుకున్నంతగా ఆడని చిత్రాలు, ఇప్పుడు చూడబోతే ఐశ్వర్య విడాకుల వ్యవహారం.. ఆయన్ని కోలుకోనివ్వకుండా చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com