Dhanush Aishwaryaa: విడాకుల తర్వాత మొదటిసారి.. ఒకే పార్టీలో ధనుష్, ఐశ్వర్య..

Dhanush Aishwaryaa: ఈమధ్య సినీ పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ నుండి మొదలయిన ఈ విడాకుల ట్రెండ్ కోలీవుడ్ వరకు వెళ్లిపోయింది. ఇక పెళ్లయి 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు ధనుష్, ఐశ్వర్య. రజినీకాంత్ ఇద్దరు కూతుళ్లు ఇలా విడాకులు తీసుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే విడాకుల గురించి ప్రకటించిన తర్వాత ధనుష్, ఐశ్వర్య మొదటిసారి ఎదురుపడినట్టు సమాచారం.
ధనుష్, ఐశ్వర్య 18 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. హీరోగా ధనుష్ అన్ని భాషా పరిశ్రమలను చుట్టేస్తుంటే.. ఐశ్వర్య కూడా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకుంటోంది. అయితే ఏమైందో తెలీదు కానీ.. ఇటీవల వీరు వీరి వివాహ బంధాన్ని ముగిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు.
ధనుష్, ఐశ్వర్య విడిపోయిన దగ్గర నుండి వీరిద్దరు మళ్లీ కలిసిపోతే బాగుండు అని కోలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అంతే కాకుండా వీరి విడాకులు ఇరువురి కుటుంబాలకు కూడా ఇష్టం లేదని సమాచారం. అయితే వీరు మాత్రం విడాకుల నిర్ణయం మీదే బలంగా నిలబడ్డారు. అంతే కాకుండా ఎవరి కెరీర్‌లో వారు మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారట.
ధనుష్, ఐశ్వర్య ఇటీవల ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి హాజరయ్యారట. అయితే విడాకుల తర్వాత వీరిద్దరు మొదటిసారి ఎదురుపడడంతో వీరి మాట్లాడుకుంటారేమో అని స్నేహితులు ఆశించారట. కానీ ధనుష్, ఐశ్వర్య ఒకరికొకరు తెలియనట్టు ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యపరిచిందని సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం వీరిద్దరు హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com