Dhanush Birthday Special: ఇష్టం లేకపోయినా నాన్నే బలవంతంగా..: ధనుష్

Dhanush Birthday Special: ఇష్టం లేకపోయినా నాన్నే బలవంతంగా..: ధనుష్
ప్రేక్షకులు ప్రతిభకు పట్టం కడతారు కానీ అందానికి కాదు అని నిరూపించాడు ఈ కోలీవుడ్ హీరో.

Dhanush Birth day special: హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా.. నాన్నా, అన్నయ్య దర్శకులైనంత మాత్రాన అవకాశాలు వచ్చేస్తాయా.. నేను నటించను బాబూ అన్నా వినకుండా నాన్న నా ముఖానికి రంగేశారు. దాంతో ఇష్టం లేకపోయినా చచ్చినట్టు హీరో అయ్యానంటాడు ధనుష్.

అవడానికి తమిళ హీరో అయినా అన్ని భాషల్లో అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా తన పాత్రల్లో ఒదిగి పోయి నటించేస్తాడు.. అందుకే అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రేక్షకులు ప్రతిభకు పట్టం కడతారు కానీ అందానికి కాదు అని నిరూపించాడు ఈ కోలీవుడ్ హీరో.

అమ్మానాన్నలు పెట్టిన పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా. 1983 జూలై 28న పుట్టిన ధనుష్‌కి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. నాన్న, అన్నయ్య దర్శకులు. తెలుగులో వచ్చిన 7జీ బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరే చిత్రాల దర్శకుడు సెల్వరాఘవన్.. ధనుష్ సోదరుడు. తెలుగువారికి శ్రీరాఘవగా పరిచయం.ఇక తండ్రి కస్తూరి రాజాకు కొడుకు ధనుష్‌లో ఏదో టాలెంట్ ఉంది దాన్ని వెలికి తీయాలి అని వద్దంటున్నా వినకుండా అతడిని హీరో చేశారు. అప్పుడు ధనుష్‌కి 16 ఏళ్లు. ఆ చిత్రమే 2002లో వచ్చిన 'తుల్లువదో ఇలమై' చిత్రం. తండ్రి అంచనాలు తప్పు కాలేదు.. సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ హీరో ఏంటి అలా ఉన్నాడు సన్నగా, పీలగా అని ప్రేక్షకుల విమర్శలు వినిపించాయి. వాటినే దీవెనలుగా భావించిన ధనుష్ రెండో సినిమా అన్నయ్య దర్శకత్వంలో వచ్చిన 'కాదల్ కొండెయిన్' లో నటించాడు.

అప్పుడు ప్రేక్షకులు అతడి రూపాన్ని కాక నటనను చూడడం మొదలు పెట్టారు. దాంతో తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్‌ని సంపాదించుకున్నాడు. నాన్న తీసుకున్న నిర్ణయం సరైందే అని అప్పుడు అనిపించింది ధనుష్‌కి.

ఐశ్వర్యతో ప్రేమా.. పెళ్లి..

రెండో సినిమా విడుదలకు ముందు ధనుష్‌ని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చింది రజనీకాంత్ కూతురు ఐశ్వర్య. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ మొదలైంది. దాంతో ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరికీ ఇద్దరు కొడుకులు. వాళ్లే ధనుష్ బెస్ట్ ఫ్రెండ్స్.

బాలీవుడ్, హాలివుడ్ చిత్రాల్లో..

రంజనా చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి షబితాబ్‌తో ప్రశంసలు అందుకున్నారు. ది ఎక్ట్సార్డనరీ జర్నీ ఆఫ్ ది పకీర్ ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ మూవీ. ఇక రఘువరన్ బీటెక్‌తో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ తెలుగు సినిమాకు ధనుష్ సైన్ చేశాడు. అతి కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

ధనుష్‌లో ఎన్ని టాలెంట్‌లో..

ధనుష్ నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా. కెరీర్ ప్రారంభంలో వచ్చిన త్రీ చిత్రంలో ఆయన రాసి పాడిన వై దిస్ కొలవెరి సాంగ్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ఐదు నిమిషాల్లో పాట రాసి అరగంటలో పాడి అదరగొట్టేశాడు. ఆ సమయంలో ఎవరు చూసినా అదే పాట హమ్ చేస్తూ కనిపించేవారు. అంతగా ఆకట్టుకుంది ఆ పాట అందరినీ.

పనిని దైవంగా భావిస్తూ..అవకాశాలు ఎప్పుడూ రావు.. వచ్చినప్పుడు కష్టపడి పని చేయాలి. మన ప్రతిభను నిరూపించుకోవాలి అని చెబుతారు ధనుష్. పరిశ్రమలో నిలబడాలంటే రూపం కాదు ప్రతిభ ముఖ్యం అంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నటుడు ధనుష్.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దలు గడిచిన ధనుష్ ప్రేక్షకుల అభిమానంతో పాటు ఆస్తులు కూడా బాగానే సంపాదించాడు.

నటుడి నికర విలువ సుమారు రూ .145 కోట్లు. నివేదికల ప్రకారం, ఈ బహుముఖ నటుడు ఒక చిత్రానికి రూ .12-15 కోట్లు వసూలు చేస్తాడు. శేఖర్ కమ్ములతో తన తదుపరి త్రిభాషా ప్రాజెక్ట్ కోసం రూ .50 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రకటనల ద్వారా సుమారు రూ .2 కోట్లు పొందుతున్నాడు (బ్రాండ్‌లపై ఆధారపడి ఉంటుంది).

లగ్జరీ వాహనాలు

ధనుష్ బోనఫైడ్ మోటర్ హెడ్. అసురాన్ స్టార్‌లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ .7 కోట్లు), ఫోర్డ్ ముస్తాంగ్ జిటి (రూ .75 లక్షలు), బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ (రూ. 3.40 కోట్లు), ఆడి ఎ 8 (రూ .1.60 కోట్లు), జాగ్వార్ ఎక్స్‌ఇ (రూ .45 లక్షలు) వంటి లగ్జరీ వాహనాలు అతడి గ్యారేజ్‌లో ఉంటాయి.

Tags

Next Story