Dhanush: 'క్యాప్టెన్ మిల్లర్'... ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Dhanush: క్యాప్టెన్ మిల్లర్... ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఈ చిత్రంలో ధనుష్ మూడు లుక్స్‌లో కనిపించనున్నాడని అరుణ్ వెల్లడించాడు

తమిళ సూపర్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్ ' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీంతో.. ధనుష్ అభిమానులు సంతోషం పట్టలేకుండా ఉంది. ఫస్ట్ లుక్ ను గమనించినట్లయితే.. యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. హెవీ మెషిన్ గన్ ను పట్టుకున్న ధనుష్ ముడివేసిన జుట్టు, పెరిగిన గడ్డంతో సింపుల్ గా చెప్పులు వేసుకుని యుద్ద భూమిలో నిల్చుంటాడు. చుట్టూ పడి ఉన్న శవాల మధ్య సేదతీరుతూ అపరకాళీలా కనిపిస్తాడు. ఈ ఫస్ట్ లుక్ ఫోస్టర్ ను చూసిన దనుష్ అభిమానులకు గూస్ బమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను ధనుష్ స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు.





రాకీ, సాని కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సెంధిల్ త్యాగరాజన్ మరియు అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రాఫర్ కాగా, నాగూరన్ రామచరణ్ ఎడిటర్. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్ కుమార్, నివేదిత సతీష్, సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్. గౌరవమే స్వేచ్ఛ' అని ధనుష్ క్యాప్షన్‌లో రాశాడు. ఈ పోస్ట్‌కు నటుడు ప్రసన్న ఫైర్ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. రాశి ఖన్నా క్లాప్ ఎమోజీల పొందుపరిచింది. కిల్లర్, కిల్లర్, కెప్టెన్ మిల్లర్ అని నివేధిత సతీష్ కామెంట్ చేశాడు. ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది.




ఫస్ట్‌లుక్ పోస్టర్ గురించి దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మాట్లాడుతూ.. "పోస్టర్‌లో ధనుష్ చేతిలో పట్టుకున్న తుపాకీ లూయిస్ గన్ అని పిలుస్తారని చెప్పాడు. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి లైట్ మెషిన్ గన్ అని తెలిపాడు. అప్పటి తుపాకీని కొనుగోలు చేసి, సినిమా కోసం చాలా ఆసక్తికరంగా మార్చినట్లు చెప్పాడు. ధనుష్ కెరీర్‌లో అతిపెద్ద చిత్రాలలో ఇది ఒకటని... అంతర్జాతీయ ప్రమాణాలతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రూపొందించడం గురించి ప్రత్యేక శ్రద్ద వహించినట్లు చెప్పాడు.

ఈ చిత్రంలో ధనుష్ మూడు లుక్స్‌లో కనిపించనున్నాడని అరుణ్ వెల్లడించాడు. “ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్‌లలో ఉంటాడు, ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ లుక్‌ లలో ఒకటి. మిగిలినవి తదుపరి ప్రమోషన్ల సమయంలో విడుదల చేస్తాము. 85 శాతానికి పైగా సినిమాను షూట్ చేశాము. స్వాతంత్య్రానికి పూర్వం 1930ల నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించబడింది." అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story