శేఖర్ కమ్ములతో ధనుష్ డి 51.. నాగార్జున కీలక రోల్

శేఖర్ కమ్ములతో ధనుష్ డి 51.. నాగార్జున కీలక రోల్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నాడు ధనుష్.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నాడు ధనుష్. ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక రోల్ పోషిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ధనుష్ సరసన రష్మిక మందన ఎంపిక చేయబడింది. దేవీశ్రీ సంగీత దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. ముంబై, కొచ్చిన్‌లలో షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

టీమ్ మొదట సంగీతం కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్‌ని సంప్రదించింది. కానీ చర్చలు ఫలించక దేవి శ్రీ ప్రసాద్ ని సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. శేఖర్ కమ్ముల, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ధనుష్ నటిస్తున్న చిత్రం కోసం నాగార్జున ఈ చిత్రంలో భాగమయ్యారు.

ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అతడి సినిమాలు తమిళంలో ఎంత పెద్ద హిట్టో తెలుగు ప్రేక్షకులు ఇక్కడ రిలీజ్ అయితే అంతే ఆదరిస్తున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సర్' సినిమా చేసి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. అది అతనికి తొలి తెలుగు సినిమా. 'సర్' కంటే ముందే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇందులో పూర్తిస్థాయి పాత్ర చేయనప్పటికీ చాలా కీలకమైన పాత్ర అని అంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయిక. ధనుష్‌తో ఆమెకు ఇదే మొదటి సినిమా. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ధనుష్‌కి 51వ సినిమా. అందుకే దీనికి డి51 మూవీ అని ప్రస్తుతానికి పేరు పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story