Kasthuri Raja: కొడుకు విడాకులపై తండ్రి షాకింగ్ కామెంట్స్..

Kasthuri Raja: కోలీవుడ్‌లో ప్రముఖ నటుడు ధనుష్.. భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్లు జనవరి 17 రాత్రి ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. కానీ ఇప్పుడు ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగని దీన్ని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని వెల్లడించింది స్వయానా ధనుష్ తండ్రి కస్తూరి రాజా.
తమిళ 'డైలీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కొడుకు ధనుష్ విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ. ఇవి కుటుంబ కలహాలు మాత్రమే అని ఆయన చెప్పారు. అయితే ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. నిజంగా అదే జరిగితే సంతోషమేగా అని అంటున్నారు ధనుష్, రజనీ అభిమానులు.
2004లో ఐశ్వర్య, ధనుష్ పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేధాలు తలెత్తాయి. దాంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ధనుష్ తన ట్వీట్‌లో విడాకులు అనే పదాన్ని ఉపయోగించకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆయన తండ్రి కస్తూరి రాజా ఈ ప్రకటన చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
కొడుకు విడాకుల వార్తలను కస్తూరి రాజు తోసిపుచ్చారు. ఇది కుటుంబ సమస్య. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అది విడాకులకు దారి తీయకూడదు. ప్రస్తుతం వాళ్లిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. నేను వారిద్దరికీ సర్ధి చెబుతున్నాను. రజనీకాంత్ కూడా విడాకుల విషయాన్ని మరోసారి ఆలోచించాలని కోరారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం సరైంది కాదని సినీ ప్రముఖులు, సన్నిహితులతో పాటు కుటుంబసభ్యులూ కోరుకుంటున్నారు అని కస్తూరి రాజా అన్నారు.
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n
— Dhanush (@dhanushkraja) January 17, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com