Dhanush / Nayantara : నయన్ ను వదిలా అంటున్న ధనుష్

కోలీవుడ్ లో కొన్నాళ్లుగా ఓపెన్ వార్ గా మారింది ధనుష్ వర్సెస్ నయనతార వ్యవహారం. రీసెంట్ గా నయన్ సినిమా కెరీర్ కు సంబంధించిన కొన్ని వాస్తవాలతో కూడిన డాక్యుమెంటరీని క్రియేట్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీదాన్(నేనూ రౌడీనే) అనే మూవీ నుంచి మూడు సెకన్ల క్లిప్ ను వాడుకున్నారు. అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ధనుష్. తన పర్మిషన్ లేకుండా ఆ మూడు సెకన్లు మాత్రం ఎలా వాడతారు అని ఏకంగా 10 కోట్లకు దావా వేశాడు. ఇది ఊహించని నయన్ తనపై పాత కక్షలతోనే ఇలా చేస్తున్నాడు అంటూ ఓ పెద్ద లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లెటర్ చూసిన తర్వాత చాలామంది ధనుష్ ను విమర్శించారు. 3 సెకన్ల వీడియోకు పది కోట్లా అంటూ ఓపెన్ గానే తిట్టేశారు. దీంతో ధనుష్ వెనక్కి తగ్గుతాడు అనుకున్నారు. బట్ అతను తగ్గేదే లే అంటున్నాడు.
తాజాగా ధనుష్ లాయర్స్ ఇదే విషయంపై కోర్ట్ ను ఆశ్రయించారు. తమ క్లయింట్ ధనుష్ కు న్యాయం చేయాలనేది వారి వాదన. నిజానికి కోర్ట్ వ్యవహారాల్లో సెంటిమెంట్స్ కు చోటుండదు. ఎమోషన్స్ పరిగణలోకి రావు. చట్టం ఏం చెబుతుందో అదే ఫాలో కావాలి. సో.. కాపీ రైట్ యాక్ట్ పరంగా చూస్తే ఈ విషయంలో ధనుష్ కు న్యాయం జరగొచ్చు అంటున్నారు. సో.. మేటర్ కోర్ట్ వరకూ వెళ్లింది. ధనుష్ తగ్గను అంటున్నాడు. కాబట్టి నయన్.. ఇప్పుడు పది కోట్లు ఇస్తుందా లేక ఇంకేదైనా కొత్త రూట్ లో వస్తుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com