Dhanush : రెమ్యునరేషన్‌ను భారీగా పెంచిన ధనుష్..

Dhanush : రెమ్యునరేషన్‌ను భారీగా పెంచిన ధనుష్..
Dhanush : కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘ ద గ్రే మ్యాన్’లో నటించారు. అప్పటి నుంచి రెమ్యునరేషన్ అమాంతం పెరిగిందని టాక్ వినిపిస్తోంది

Dhanush : కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇటీవళ హాలీవుడ్ చిత్రం 'గ్రే మ్యాన్'లో నటించారు. అప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ అమాంతం పెరిగిందని టాక్ వినిపిస్తోంది. ధనుష్ తన 20 ఏళ్ల కెరీర్‌లో కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. అక్షయ్ కుమార్‌తో కలిసి 'అత్రంగీరే' మూవీతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. రేపు 18న ధనుష్ నటించిన తమిళ మూవీ 'తిరుచిత్రాంబళం' తిరు పేరుతో తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రూ.15 కోట్లవరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

'కర్ణన్' తో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించాడు. ఆ తరువాత వచ్చిన 'జగమేతందిరం', 'పటాస్', 'ది గ్రే మ్యాన్' పెద్దగా ఆడలేదు. తిరు తరువాత్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్ సినిమా రిలీజ్ కానుంది. మాథేశ్వరన్ డైరెక్షన్‌లో కెప్టెన్‌మిల్లర్‌, గ్రే మ్యాన్ సీక్వెల్‌లో కూడా ధనుష్ నటించనున్నారు. ధనుష్ ఆస్తుల విలువ రూ.160 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ధనుష్ రూ.31 కోట్లను ఆర్జిస్తున్నారు.

Tags

Next Story